Share News

AP Assemby: ఏపీ శాసనసభలో పలు బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రులు

ABN , Publish Date - Nov 21 , 2024 | 04:44 PM

Andhrapradesh: ఐదు సంవత్సరాల్లో లక్షల కోట్ల ఆస్తులు కబ్జా అయ్యాయని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తెలిపారు. విశాఖ, చిత్తూరు ఇతర జిల్లాల్లో భయానకంగా అయిపోయిందని తెలిపారు. ‘‘నా నియోజకవర్గంలో 550 కోట్ల ఆస్తిని కబ్జా చేశారని అన్నారు. ఐదు సంవత్సరాలు పాటు కలెక్టరేట్‌ను చిల్లర కొట్టుగా మార్చేశారని మండిపడ్డారు.

AP Assemby: ఏపీ శాసనసభలో పలు బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రులు
AP Assembly budget Session

అమరావతి, నవంబర్ 21: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభలో పలు బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టారు. ఏపీ భూ దురాక్రమణ నిషేధ బిల్లు 2024 ను మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రవేశపెట్టగా, ఏపీ లోకాయుక్త చట్ట సవరణ బిల్లును, అలాగే సహజవాయు వినియోగంపై జీఎస్టీ పన్నును తగ్గిస్తూ జీఎస్టీ సవరణ బిల్లును శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో చెత్త పన్నును రద్దు చేస్తూ ఏపీ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లును పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ సభలో ప్రవేశపెట్టారు.

ABV: నేనేంటో చూశావ్.. నోరు అదుపులో పెట్టుకో.. జగన్‌కు ఏబీవీ హెచ్చరిక


ఏపీ భూ దురాక్రమణ నిషేధ బిల్లు 2024..

gorantla.jpg

ఏపీ భూ దురాక్రమణ నిషేధ బిల్లు 2024ను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టగా.. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల్లో లక్షల కోట్ల ఆస్తులు కబ్జా అయ్యాయని తెలిపారు. విశాఖ, చిత్తూరు ఇతర జిల్లాల్లో భయానకంగా అయిపోయిందని తెలిపారు. ‘‘నా నియోజకవర్గంలో 550 కోట్ల ఆస్తిని కబ్జా చేశారని అన్నారు. ఐదు సంవత్సరాల పాటు కలెక్టరేట్‌ను చిల్లర కొట్టుగా మార్చేశారని మండిపడ్డారు. కలెక్టర్‌లు , జాయింట్ కలెక్టర్‌లు ఇష్టానుసారం మ్యూటేషన్ చేసేశారన్నారు. అక్కడి నుంచి వెళ్లిపోయినప్పటికీ ఎంఆర్‌వో పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్లు చేశారన్నారు. అధికారులు వారి వాటాలు వారు వేసుకొని ఇష్టానుసారం మ్యూటేషన్ చేసుకున్నారని మండిపడ్డారు. విదేశాల్లో ఉన్న వారి భూములను కూడా కబ్జా చేశారన్నారు. రికార్డులు తగలేస్తే చర్యలు ఏవి, మదన పల్లిలో, విజయవాడలో ఏం జరిగింది అని అన్నారు. ఎవరైనా ఇతర భూములు కబ్జా చేయాలంటే భయపడాలి అని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు.


గత ప్రభుత్వంలో కక్ష సాధింపులు: మంత్రి నారాయణ

narayana-assembly.jpg

ఏపీ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లుపై మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాష్ట్రంలో గృహాలు, వాణిజ్య సముదాయాల నుంచి దాదాపు రూ.325 కోట్ల రుపాయల మేర చెత్త పన్ను వసూలు చేసిందని తెలిపారు. చెత్త పన్ను కట్టనివారి ఇళ్ల వద్ద చెత్త వేయటం, వాణిజ్య సముదాయాల్లోనూ చెత్త కుమ్మరించటం , నీటి కనెక్షన్ల తొలగింపు లాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా చెత్త పన్నును రద్దు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. దానికి సంబంధించిన మున్సిపల్ చట్ట సవరణను చేస్తూ బిల్లును మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టారు.


సహజవాయువుపై జీఎస్టీ 5 శాతానికి తగ్గింపు : మంత్రి పయ్యావుల

payyavual-keshav.jpg

అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సహజవాయు వినియోగంపై జీఎస్టీ పన్నును తగ్గిస్తూ జీఎస్టీ సవరణ బిల్లును ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో సహజవాయు వినియోగంపై విధిస్తున్న పన్నును 24 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ మంత్రి బిల్లు పెట్టారు. వైసీపీ హయాంలో సహజవాయువుపై పన్నును 5 నుంచి 24 శాతానికి పెంచటం వల్ల ఆదాయం కోల్పోయామని ఈ సందర్భంగా పయ్యావుల తెలిపారు. ఏపీలో అత్యధిక పన్ను కారణంగా పరిశ్రమలు పొరుగు రాష్ట్రాల నుంచి సహజవాయువును తెచ్చుకుని కేవలం 2 శాతం మాత్రమే పన్ను కట్టారని వెల్లడించారు. అందుకే రాష్ట్ర ఆదాయంతో పాటు ప్రజలకు భారం తక్కువ ఉండేలా సహజవాయువుపై జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తూ బిల్లును మంత్రి పయ్యావుల సభలో ప్రవేశపెట్టారు.


జగన్ ప్రోత్సాహంతోనే పోస్టులు: హోంమంత్రి అనిత

anitha-assembly-1.jpg

ఏపీ అక్రమమద్యం వ్యాపారుల, బందిపోటు దొంగల, మత్తుమందు అపరాదుల, గూండాల, వ్యబిచార వ్యవహర అపరాదుల, భూ ఆక్రమణదారుల యోక్క ప్రమాదకరమయిన కార్యకలాపాల సవరణ బిల్లు 2024ను హోమంత్రి వంగలపూడి అనిత శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. ఐదేళ్ల కన్నా 5 నెలల కాలంలో క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. మహిళలు, పిల్లలపై వేధింపులు 18 శాతం తగ్గాయన్నారు. క్రిమినల్స్‌కు సీఎం అంటే భయమని.. అందుకే వారు అస్త్ర సన్యాసం చేశారన్నారు. ప్యాక్షన్, మత విధ్వంసాలను నిలువరిచిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని తెలిపారు. సోషల్ మీడియా, భూ ఆక్రమణలు విపరీతంగా పెరిగాయన్నారు. నోటితో మాట్లాడలేని, చెవితో వినలేని మాటలు వారు మాట్లాడారని మండిపడ్డారు. జగన్ ప్రోత్సాహంతో ఇంత మందిపై పోస్టులు పెట్టారని ఆరోపించారు. తల్లి, చెల్లిపుట్టక గురించి మాట్లాడి వ్యక్తిత్వ హననం చేస్తున్నారన్నారు. నిండు సభలో ప్రజాప్రతినిధులే భూతులు మాట్లాడడం అవమానించడం చూశామన్నారు. పీడీ యాక్ట్‌ను సవరణ చేయాల్సిన అవసరం వీరి వల్ల వచ్చిందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నా అసెంబ్లీకి రాకుండా బయట కూర్చుని మాట్లాడే పరిస్థితి ఉందన్నారు. వర్ర రవీంద్రా రెడ్డి సోషల్ మీడియా వ్యవహరంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని పేర్కొన్నారు. అలాంటి వాడి తరపున గత సీఎం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో దిశా చట్టం తెచ్చి దానికి చట్టబద్ధత లేకుండా చేశారన్నారు. దిశా యాప్ ఉంటే క్రైమ్ ఆగిపోతుందని చెబుతున్నారన్నారు. సోషల్ మీడియాతో పాటు ఇతర 14 చట్టాలకు సంబంధించి సభ ముందు ఉంచి ఆమోదం కోసం విజ్ఞప్తి చేస్తున్నట్లు హోంమంత్రి అనిత పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Cyber Fraud ఈ-నేరగాళ్లకు ఝలక్ ఇచ్చిన ఉద్యోగి

షాకింగ్ రూ. 4 వేలు తగ్గిన వెండి.. ఇక బంగారం రేటు

Read latest AP News And Telugu News

Updated Date - Nov 21 , 2024 | 04:55 PM