YS Sharmila: ఇదో జాతీయ స్థాయి కుంభకోణం
ABN , Publish Date - Dec 02 , 2024 | 03:55 PM
Andhrapradesh: గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయ్యిందంటే మన చెక్ పోస్టుల పని తీరు ఏంటో అంచనా వేయొచ్చన్నారు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ‘‘అక్రమ బియ్యాన్ని పట్టేందుకు మీరు బోట్లు వేసుకొని సముద్రంలో హడావిడి చేయడం కాదు. నిజాలు నిగ్గు తేల్చండి’’ అంటూ కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.
విజయవాడ, డిసెంబర్ 2: రాష్ట్రంలో పీడీఎస్ రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా.. ఇదో జాతీయ స్థాయి కుంభకోణం అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పేదల పొట్టకొట్టి 48 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేసిన దోపిడీ చేశారని మండిపడ్డారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు.. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని ఆరోపించారు. కింద నుంచి ఉన్నత స్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందన్నారు.
ముంబై డైనమైట్‌ని అందుకే వదులుకున్నాం
ఎవరికి దక్కాల్సిన వాట వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్ళుమూసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయ్యిందంటే మన చెక్ పోస్టుల పని తీరు ఏంటో అంచనా వేయొచ్చన్నారు. ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ‘‘అక్రమ బియ్యాన్ని పట్టేందుకు మీరు బోట్లు వేసుకొని సముద్రంలో హడావిడి చేయడం కాదు. నిజాలు నిగ్గు తేల్చండి’’ అంటూ కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.
జగన్ కేసుపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం..
‘‘పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా పోర్టు దాకా ఎలా చేరుతుంది ? మూడేళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారు ? దీని వెనకున్న బియ్యం దొంగలెవరు? రూ.48 వేల కోట్లు ఎవరెవరు తిన్నారు? అప్పటి ప్రభుత్వ పెద్దలకు బియ్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయా? పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలి. లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలి’’ అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
కాగా.. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును పరిశీలించి అక్కడ జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రేషన్ అక్రమ రవాణాపై పవన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా కూడా మారాయి. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం రవాణా అవుతుండటంపై అధికారులపై సీరియస్ అయ్యారు. సముద్రంలో సుమారు 9 నాటికల్ మైళ్లదూరంలో రవాణాకు సిద్ధమైన 640 టన్నుల బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ పనామా షిప్ వద్దకు స్వయంగా వెళ్లి చూశారు. కాకినాడ పోర్టు అధికారులు తనకే సహకరించలేదని ఈ సందర్భంగా పవన్ అన్నారు. అయితే కాకినాడ పోర్టును పవన్ పరిశీలించడం, అక్కడ జరుగుతున్న రేషన్ బియ్యం వ్యవహారం బయటకు రావడంతో ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై రాజకీయ నేతలు తప్పుబడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
వార్ జోన్‌గా మారిన తెలంగాణ, ఛత్తీస్ గడ్ సరిహద్దు..
ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telugu News