కృష్ణాడెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా దేవనబోయిన వెంకటేశ్వరరావు
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:58 AM
కృష్ణాడెల్టా ప్రాజెక్టు కమిటీ నూతన చైర్మన్‌గా కోడూరు డీసీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు(జనసేన), వైస్ చైర్మన్‌గా నిడుమోలు డీసీ చైర్మన్ వల్లూరిపల్లి గణే్‌ష(టీడీపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వైస్ చైర్మన్‌గా వల్లూరిపల్లి గణేష్
మచిలీపట్నం టౌన్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): కృష్ణాడెల్టా ప్రాజెక్టు కమిటీ నూతన చైర్మన్‌గా కోడూరు డీసీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు(జనసేన), వైస్ చైర్మన్‌గా నిడుమోలు డీసీ చైర్మన్ వల్లూరిపల్లి గణే్‌ష(టీడీపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో ప్రాజె క్టు కమిటీ ఎన్నిక నిర్వహించారు. దేవనబోయిన అభ్యర్థిత్వాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రతిపాదించారు. చైర్మన్, వైస్ చైర్మన్లను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు సత్కరించారు. ఐదేళ్ల పాలనలో సాగునీటికాలువలు, డ్రెయిన్ల పూడికలు తీయలేదని, రానున్న కాలంలో కాలువ చివరి భూములకూ సాగునీరందించేందుకు దేవనబోయిన వెంకటేశ్వరరావు కృషి చేయాలని ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సు లు నిర్వహిస్తోందని, రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తోందని మం డలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. డీఆర్వో చంద్రశేఖర్ పాల్గొన్నారు.