టీడీపీ నేతలపై దాడులు దుర్మార్గం
ABN , Publish Date - May 17 , 2024 | 12:57 AM
ఎన్నికల్లో అరాచకపాలనకు వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో నిరాశ, నిస్పృహలతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేత లపై వైసీపీ నేతలు దాడులకు దిగారని, ఇది దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చిరుమామిళ్ల సూర్యనారాయణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హనుమాన్‌జంక్షన్‌రూరల్, మే 16: ఎన్నికల్లో అరాచకపాలనకు వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో నిరాశ, నిస్పృహలతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేత లపై వైసీపీ నేతలు దాడులకు దిగారని, ఇది దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చిరుమామిళ్ల సూర్యనారాయణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ రోజున వైసీపీ నేతల దాడికి గురైన ఆళ్ల గోపాలకృష్ణను ఆయన పరా మర్శించారు. రంగన్నగూడెం టీడీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సంఘీభావ సదస్సులో ఆయన మాట్లాడారు. ఆళ్ల గోపాలకృష్ణపై భౌతికదాడి హేయ మన్నారు. కొత్తమల్లవల్లితో సహా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు చేసిన దాడులకు త్వరలోనే వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. మహిళలను గౌరవించడం చేత గాని వైసీపీకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారని, గన్నవరం నియోజక వర్గంలో84శాతం పోలింగ్ నమోదవడమే దీనికి నిదర్శనమని తెలుగుమహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు మేడేపల్లి రమా అన్నారు. ప్రజాస్వా మ్యంలోభౌతికదాడులు అమానుషమని టీడీపీ మండల అధ్యక్షుడు దయాల రాజే శ్వరరావు అన్నారు. నాయకులు యనమదల వెంకయ్యారావు, కసుకుర్తి రంగామణి, పుసులూరి లక్ష్మీనారాయణ, మొవ్వా వేణుగోపాల్, పుట్టా సురేష్, కలపాల సూర్య నారాయణ, మాదాల శ్రీను, అక్కినేని రవి, అలూరి రామకృష్ణప్రసాద్, వల్లూరిపల్లి నాని, కొండేటి నాగరాజు, పాల్గొన్నారు.