Share News

మాదకద్రవ్యాల నివారణ, సైబర్‌ క్రైమ్‌పై అవగాహన

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:55 PM

కేబీఎన్‌ కాలేజీలో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం మాదక ద్రవ్యాల నివారణ, సైబర్‌ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమాలు జరిగాయి.

మాదకద్రవ్యాల నివారణ, సైబర్‌ క్రైమ్‌పై అవగాహన
ప్రసంగిస్తున్న ఏసీపీ మురళీ కృష్ణారెడ్డి

మాదకద్రవ్యాల నివారణ, సైబర్‌ క్రైమ్‌పై అవగాహన

వన్‌టౌన్‌, జూలై 26: కేబీఎన్‌ కాలేజీలో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం మాదక ద్రవ్యాల నివారణ, సైబర్‌ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమాలు జరిగాయి. కేబీఎన్‌ కాలేజీలో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వెస్ట్‌ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ జీవితంలో విద్యార్థి దశ చాలా కీలకమైనదని, ఈ దశలో మత్తు పదార్థాలకు అలవాటు పడితే భవిష్యత్తు నాశనమవుతుందని అన్నారు. సిటీ సైబర్‌ క్రైం సీఐ పి. శ్రీను , కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి నారాయణరావు, కొత్తపేట సీఐ టి. గణేష్‌, సైబర్‌ క్రైం సీఐ సీహెచ్‌ ఆర్కే మూర్తి, కొతపేట ఎస్‌ఐ నరేంద్ర, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం. వెంకటేశ్వరరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవోలు డి. పవన్‌కుమార్‌, ఎన్‌. సాంబశివరావు, కల్మాబేగం తదితరులు పాల్గొన్నారు.

సైబర్‌ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి

అజిత్‌సింగ్‌నగర్‌ : సైబర్‌ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసు సీఐ గురుప్రకాష్‌ అన్నారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని కేర్‌ అండ్‌ షేర్‌ పాఠశాలలో శుక్రవారం సైబర్‌ క్రేమ్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నకిలీ అకౌంట్లతో సోషల్‌ మీడియాలో పరిచయాలు పెంచుకోవడం, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం తదితర అంశాలపై తగు జాగ్రత్తలను వివరించారు. ఎస్సై మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:55 PM