బాలోత్సవం ప్రారంభం
ABN , Publish Date - Nov 16 , 2024 | 01:09 AM
పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో అమరావతి బాలోత్సవం 7వ పిల్లల పండుగ మూడు రోజుల కార్యక్రమాన్ని శుక్రవారం బాలోత్సవ్ గౌరవాధ్యక్షుడు ప్రముఖ విద్యావేత్త, పారిశ్రామికవేత్త చలువాది మల్లికార్జునరావు జెండా అవిష్కరించి ప్రారం భించారు.
మొగల్రాజపురం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో అమరావతి బాలోత్సవం 7వ పిల్లల పండుగ మూడు రోజుల కార్యక్రమాన్ని శుక్రవారం బాలోత్సవ్ గౌరవాధ్యక్షుడు ప్రముఖ విద్యావేత్త, పారిశ్రామికవేత్త చలువాది మల్లికార్జునరావు జెండా అవిష్కరించి ప్రారం భించారు. ముఖ్య అతిథిగా సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణ రావు పాల్గొన్నారు. మొదటి రోజు కార్టూన్, పోస్టర్ ప్రజంటేషన్, వ్యాసరచన (ఇంగ్లీషు, తెలుగు), మట్టిబొమ్మల తయారీ, తెలుగు డిక్టేషన్, అంతర్జాలంలో అన్వేషణ, కవితా రచనా, స్పెల్ బీ, ఉత్తరం రాయడం, జానపదనృత్యం, ఫాన్సీ డ్రెస్, విచిత్ర వేషధారణ; క్లాసికల్ డాన్సు, లఘు నాటిక, దేశభక్తి గీతం వంటి అంశాల్లో జూనియర్స్, సీనియర్స్ విభాగంలో పోటీలు నిర్వ హించారు. 20 వేదికలపైన 60 అంశాల్లో 200 పాఠశాలలకు చెందిన 12వేల మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొంటున్నారని బాలోత్సవ్ అధ్యక్షుడు రామారావు కార్యదర్శి కొండలరావు తెలిపారు. ఎస్‌బీఐ డీజీఎం మనీష్ కు మార్‌సింగ్, క్రెడాయ్ అధ్యక్షుడు దాసరి రాంబాబు, విదార్థులు, పాఠశాలల యాజమాన్యాలు పాల్గొన్నాయి.