Ayodhya: అయోధ్యకు వెళ్లనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
ABN , Publish Date - Jan 21 , 2024 | 09:18 AM
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అయోధ్య వెళుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం అయోధ్యకు వెళ్లి రాత్రికి అక్కడే బస చేసి.. సోమవారం రామ్ లాలా విగ్రహ ప్రాణ ప్రతష్టకు హాజరవుతారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అయోధ్య వెళుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం అయోధ్యకు వెళ్లి రాత్రికి అక్కడే బస చేసి.. సోమవారం రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు హాజరవుతారు. ఇద్దరు నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతుండడంతో బీజేపీతో పొత్తులపై రాజకీయ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.
ఈ క్రమంలో ఈనెల 25న కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘రా కదలిరా’ కార్యక్రమం వాయిదా పడింది. 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి చంద్రబాబు వెళ్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈనెల 27 లేదా 28 తేదీల్లో పత్తికొండలో ‘రా కదలిరా’ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.