Share News

ఆధునిక సాంకేతికతతో సైబర్‌ నేరాలకు చెక్‌

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:54 AM

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టాలని, సమష్టి కృషితోనే ఇది సాధ్యపడుతుందని సెంట్రల్‌ జోన్‌ ఏసీపీ దామోదర్‌ అన్నారు.

ఆధునిక సాంకేతికతతో సైబర్‌ నేరాలకు చెక్‌
సెంట్రల్‌ జోన్‌ ఏసీపీ దామోదర్‌, పటమట, గుణదల సీఐలు పవన్‌ కిషోర్‌, వాసిరెడ్డి శ్రీనివాస్‌

ఆధునిక సాంకేతికతతో సైబర్‌ నేరాలకు చెక్‌

అవగాహన సదస్సులో

ఏసీపీ దామోదర్‌

గుణదల, అక్టోబరు 22 (ఆంరఽధజ్యోతి): ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టాలని, సమష్టి కృషితోనే ఇది సాధ్యపడుతుందని సెంట్రల్‌ జోన్‌ ఏసీపీ దామోదర్‌ అన్నారు. పటమట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పలు రకాల బ్యాంకర్లతో సెంట్రల్‌ జోన్‌ ఏసీపీ దామోదర్‌ మంగళవారం సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టడం ఎలా అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకౌంట్లో నుంచి నగదు విత్‌డ్రా అయినట్లుగా మెసేజ్‌ వస్తే తక్షణమే 1930 నెంబరుకు కాల్‌ చేస్తే క్షణాల్లో నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌లో నమోదు కావడం జరుగుతుందని తెలిపారు. వెంటనే ఏ అకౌంట్‌ నుంచి నగదు విత్‌డ్రా అయి మరో బ్యాంక్‌కు జమ అయ్యిందో సదరు బ్యాంక్‌ అకౌంట్‌ నిలిపివేస్తారని, అలా చేయడం వల్ల నేరస్తులు నగదును డ్రా చేసుకోకుండా నిలువరించి సమస్యను పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. బ్యాంకర్లు, పోలీసులు, పౌరులు సమష్టిగా పనిచేస్తేనే సైబర్‌ నేరగాళ్ళకు చెక్‌పెట్టడం సాధ్యపడుతుందన్నారు. అపరిచి తులు ఫోన్‌ చేసి తాము బ్యాంక్‌ నుంచి కాల్‌ చేస్తున్నామని, ఇన్‌కం ట్యాక్స్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని, సీబీఐ అని ఇలా ఎదుటివారిని నమ్మించేలా కాల్‌ చేస్తారని, పలు రకాల సమాచారం సేకరిస్తారని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నకిలీ పత్రాలతో రుణాలు పొందేవారు కూడా తయారయ్యారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పటమట సీఐ పవన్‌ కిషోర్‌, గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:54 AM