Share News

స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దుతా

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:50 AM

వచ్చే గాంధీ జయంతి నాటికి స్వచ్ఛ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలబెడతామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు.

 స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దుతా
కొమ్మారెడ్డి పట్టాభిని సత్కరిస్తున్న టీడీపీ నేతలు కళ్లే నాగేశ్వరరావు, గుండారపు హరిబాబు తదితరులు

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌

వన్‌టౌన్‌, నవంబరు 18 (ఆంరఽధజ్యోతి): వచ్చే గాంధీ జయంతి నాటికి స్వచ్ఛ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలబెడతామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు. నేటి యువత సామాజిక స్పృహ కలిగి ఉండ టంతో పాటు ప్రశ్నించే తత్వాన్ని అలవరు చుకోవాలని ఆయన సూచించారు. తుమ్మల పల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌గా పట్టాభిరామ్‌ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వందలాది మంది అభిమానులు హాజరయ్యారు. మహాత్మాగాంధీ, ఎన్టీ రామారావు, పట్టాభిరామ్‌ తండ్రి దుర్గాప్రసాద్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన తండ్రి కొమ్మారెడ్డి దుర్గాప్రసాద్‌ క్రమశిక్షణతో తనను పెంచారని పట్టాభి రామ్‌ అన్నారు. ఆయన నేర్పిన విలువలే తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయన్నారు. ఎన్టీఆర్‌పై అభిమానం తో తమ కుటుంబంలో అందరం తొలి నుంచి టీడీపీకి పని చేశామన్నారు. నేటి యువతలో ఫైర్‌ లేకుండా పోతోందని, సమాజంలో అన్యాయాలపై ప్రశ్నించ టంతో పాటు పోరాడేతత్వాన్ని అలవాటు చేసుకోవాల న్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2012లో ప్రారం భించిన పాదయాత్రతో తన రాజకీయ జీవితం ప్రారంభమైందన్నారు. గత ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన నెల నుంచే రాష్ర్టాన్ని లూటీ చేయ టం ప్రారంభించిందని, ప్రజలను ఇబ్బందులకు గురి చేయటంతో తాను గళం వినిపించాల్సి వచ్చిందన్నారు. తానెప్పుడూ నిరాధార, అసత్య ఆరోపణలు చేయలేద న్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ వాస్తవాలు మాట్లాడాలని చెబుతుండేవారని, ఆయన చూపిన మార్గదర్శకత్వంలోనే ముందుకు వెళుతు న్నానన్నారు. చెత్త నుంచి సంపద తయారీతో పాటు విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటా మన్నారు. వారం పాటు ఏదైనా గ్రామంలో చెత్త తీయటం మానేస్తే ఆ గ్రామంలో ఉండలేమన్నారు. అలాంటి చెత్తపై వైసీపీ ప్రభుత్వం పన్ను వేసిం దన్నారు. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ ద్వారా కేంద్రం నుంచి నిధులు తెచ్చేలా కృషి చేస్తానన్నారు.

పదవుల్లో యువతకు పెద్దపీట

స్వచ్ఛంధ్ర చైర్మన్‌గా పట్టాభి పనిచేయటం ఆనందంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. యువతను ప్రోత్సహించే విధంగా చంద్రబాబు పదవులు ఇస్తున్నారని, వచ్చే 30 ఏళ్లలో కమిట్‌మెం ట్‌తో యువత పనిచేసేలా ప్రోత్సహిస్తున్నారన్నారు. జగన్‌ ప్రభుత్వంపై పట్టాభి దైర్యంగా గళం ఎత్తారన్నా రు. ఇంటిపై దాడి చేసినా, అక్రమ అరెస్టులు చేసినా భయపడలేదన్నారు. బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరా పదేళ్లుగా ఎన్నో పోరాటాలు చేశారని, కమిట్‌మెంట్‌తో పనిచేసిన వారిని సీఎం తప్పకుండా గుర్తించి తగిన సమయంలో పదవులు ఇస్తారన్నారు. పట్టాభిరామ్‌ గత ప్రభుత్వ అరాచకాలను ధైర్యంగా ఎదిరించారని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. పట్టాభికి చైర్మన్‌ పదవి ఇవ్వటం చాలా ఆనందంగా ఉంద న్నారు. టీడీపీ నాయకుల అందరి కృషి వల్ల ఎంపీగా ఎన్నికై ఇక్కడ ఉన్నానని ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) తెలిపారు. జగన్‌రెడ్డి ప్రభుత్వంలో గాంధీ తరహాలో పట్టాభి అయిదేళ్లు పోరాటం చేశారని తూర్పు ఎమ్మెల్యే గద్డె రామ్మోహన్‌రావు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్ర మాలను పట్టాభిరామ్‌ బయటకు తీసుకువచ్చి ప్రజల్లో చైతన్యం తెచ్చారని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. స్వచ్ఛంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి అర్హుడు పట్టాభిరామ్‌ అని సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ అశోక్‌ బాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎన్నారై ప్రతినిధి తిలక్‌, వర్ల రామయ్య మాట్లాడారు. గద్దే అనురాధ, ఎం.ఎస్‌.బేగ్‌, మన్నవం మోహనకృష్ణ, మాల్యాద్రి, బాల కోటయ్య, రఫీ పాల్గొన్నారు.

వన్‌టౌన్‌: కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. కళ్లే నాగేశ్వర రావు, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ గుండారపు హరిబాబు, ప్రజా ప్రతినిధుల కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తల్లా ప్రసాద సుబ్బారావులు సత్కరించారు.

Updated Date - Nov 19 , 2024 | 01:51 AM