ముగిసిన సీబీఎస్‌ఈ రీజినల్ సైన్స్ ఎగ్జిబిషన్
ABN , Publish Date - Nov 13 , 2024 | 12:14 AM
నలంద విద్యానికేతన్ సెకండరీ విభాగంలో నిర్వహిస్తున్న సీబీఎస్‌ఈ రీజినల్ సైన్స్ ఎగ్జిబిషన్ మంగళవారం ముగిసింది.
ముగిసిన సీబీఎస్‌ఈ రీజినల్ సైన్స్ ఎగ్జిబిషన్
విజేతలకు బహుమతులు ప్రదానం
గవర్నర్‌పేట, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): నలంద విద్యానికేతన్ సెకండరీ విభాగంలో నిర్వహిస్తున్న సీబీఎస్‌ఈ రీజినల్ సైన్స్ ఎగ్జిబిషన్ మంగళవారం ముగిసింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో వివిధ ప్రాంతాల నుంచి 40 సీబీఎస్‌ఈ పాఠశాలలకు చెందిన 120 మంది విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించారు. వివిధ వైజ్ఞానిక నమూనాలకు న్యాయనిర్ణేతలు విజేతలను ప్రకటించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌ఐసీ అడిషనల్ ఎస్‌ఐవో పి. చంద్రశేఖరన్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విజ్ఞాన శాస్త్రం ప్రాముఖ్యత, దాని ప్రయోజనాలు వివరించారు. భవిష్యత్తు అవసరాలు తీర్చడానికి ప్రస్తుతతరాన్ని సిద్ధం చేయడానికి ఇటువంటి ప్రదర్శనలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. నలంద విద్యానికేతన్ ప్రిన్సిపాల్ మాదల పద్మజ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.