Share News

ముగిసిన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:53 PM

ప్రస్తుత సమాజానికి అనుగుణంగా నూతన నైపుణాలను, టెక్నాలజీలను నేర్చుకోవడం ఎంతో అవసరమని సీనియర్‌ ట్రైనర్‌ మైక్రోసాఫ్ట్‌ బెంగళూర్‌ ఎ.మల్లిఖార్జున్‌ తెలిపారు.

ముగిసిన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌
జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మల్లికార్జునరావు, ప్రిన్సిపాల్‌ కల్పన

ముగిసిన ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌

లబ్బీపేట, జూలై 26: ప్రస్తుత సమాజానికి అనుగుణంగా నూతన నైపుణాలను, టెక్నాలజీలను నేర్చుకోవడం ఎంతో అవసరమని సీనియర్‌ ట్రైనర్‌ మైక్రోసాఫ్ట్‌ బెంగళూర్‌ ఎ.మల్లిఖార్జున్‌ తెలిపారు. సిద్ధార్థ మహిళా కళాశాలలో శుక్రవారం కంప్యూటర్జ్‌ సైన్స్‌ విభాగం, ఐసీటీ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఐదు రోజులు జరిగిన ఫ్యాకల్టీ డెవల్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఫ్యాకల్టీ డెవల్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ అధ్యాపకుల అభివృద్ధికి ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్థులు కూడా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ, చాట్‌బాట్స్‌, కాపిలాట్‌, ఓపెన్‌ ఐ అనే అంశాలపై పట్టు సాధించాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.కల్పన, కళాశాల స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఆర్‌.మాధవి, కంప్యూటర్‌ సైన్స్‌, స్టాటిస్టిక్స్‌, ఎలక్ర్టానిక్స్‌ విభాగ అధ్యాపకులు, ఇతర కళాశాలలకు సంబంధించిన ఆసక్తి కలిగిన అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:53 PM