ఇంటింటి సర్వే చేయండి : కమిషనర్
ABN , Publish Date - May 29 , 2024 | 12:12 AM
నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వైద్యశాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య సమస్యలపై సమగ్రంగా సర్వే నిర్వహించాలని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ సంబంధిత అధికా రులను ఆదేశించారు.
ఇంటింటి సర్వే చేయండి : కమిషనర్
ఫటెస్టింగ్‌కు మంచినీటి శాంపిల్స్ గుంటూరు పంపించిన అధికారులు
చిట్టినగర్, మే 28: నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వైద్యశాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య సమస్యలపై సమగ్రంగా సర్వే నిర్వహించాలని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ సంబంధిత అధికా రులను ఆదేశించారు. మంగళ వారం మొగల్రాజపురం పటమట వారివీధి, గుమ్మడివీధి, అట్లూరి పర్వతమ్మవీధి, వాటర్ ట్యాంక్ రోడ్డు, బోయపాటివారి వీధిలో మంచినీటి సరఫరాను పరిశీలిం చారు. మొగల్రాజపురం వాటర్ ట్యాంక్‌ను సందర్శించి మంచినీటిని పరిశీలించారు. వాటర్ ట్యాంక్ ప్రాంతంలో నివాసితులతో మాట్లాడి మంచినీటి సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసు కున్నారు. ఆయా ప్రాంతంలో నివా సాల నుంచి మంచినీటిని పట్టి పరిశీలించారు. నీటి పరీక్షలు నిర్వహించారు. మంచినీరు ఎటు వంటి కలుషితం కాలేదని అధికా రులు ప్రజలకు ప్రత్యక్షంగా వివరిం చారు. మెరుగైన పరీక్షల నిమిత్తం కొన్ని మంచినీటి శాంపిల్స్ గుంటూరు ల్యాబ్‌కు పంపించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అవరమైతే సర్వేకు అదనపు సిబ్బంది ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కమిషనర్ జనరల్ మహేష్, జోనల్ కమిషనర్-3 శివరామకృష్ణ, చీఫ్ ఇంజనీర్ ఎం. ప్రభాకరరావు, ఈఈ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.