Share News

పిల్లల్లో సృజనాత్మకత పెంచాలి

ABN , Publish Date - Nov 18 , 2024 | 12:20 AM

నేటి పోటీ ప్రపంచంలో చదువు ప్రధానం అయిందని, కానీ పిల్లల్లో మానసిక వికాశం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరగాలంటే వారిని క్రీడలు, సాంస్కృతిక కళారంగాల్లో ప్రతిభను నిరూపించుకునే విధంగా అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహించాలని శాశనమండలి సభ్యుడు కేఎస్‌ లక్ష్మణరావు సూచించారు.

పిల్లల్లో సృజనాత్మకత పెంచాలి
పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం చేస్తున్న ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు తదితరులు

మొగల్రాజపురం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : నేటి పోటీ ప్రపంచంలో చదువు ప్రధానం అయిందని, కానీ పిల్లల్లో మానసిక వికాశం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరగాలంటే వారిని క్రీడలు, సాంస్కృతిక కళారంగాల్లో ప్రతిభను నిరూపించుకునే విధంగా అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహించాలని శాశనమండలి సభ్యుడు కేఎస్‌ లక్ష్మణరావు సూచించారు. ఇందుకు తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు, ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వాలుచేయాల్సిన పనిని బాలోత్సవ కమిటీలు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాల్లో కంటే ప్రభుత్వ పాఠశాల్లో చదువుకునే పిల్లలే ఎక్కువగా ఉన్నారని, వారిని చదువుతో పాటు వివిధ రంగాల్లో ప్రోత్సహించేలా ప్రత్యేక మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అమరావతి బాలోత్సవం 7వ పిల్లల పండుగ మూడు రోజుల కార్యక్రమం ఆదివారం ముగిసింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 78 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో, 37 లక్షల మంది ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారని చెప్పారు. కొత్త గూడెం బాలోత్సవ వ్యవస్థాపకులు వాసిరెడ్డి రమే్‌షబాబు మాట్లాడుతూ, ప్రతిమనిషి జీవితంలో బాల్యం ఒక అపురూప ఘట్టం అని అన్నారు. బాల్యం మొత్తం చదువు అంశమే ఉంటే వారిలో సృజనాత్మక శక్తి ఉండదన్నారు. ఒకపుడు ఆటలు, చదువు రెండూ బాల్యంలో ఉండేవని చెప్పారు. పెద్దలంతా కలిసి ఇపుడు బాలోత్సవం పేరిట నిర్వహిస్తుంటే తమ బాల్య స్మృతులు గుర్తుకు వస్తున్నాయన్నారు. బాలోత్సవంలో పాల్గొనే పిల్లల్లో మార్పు వస్తుందని, జీవితం పట్ల ఒక దృక్పధం ఏర్పడుతుందని, భవిష్యత్‌ను నిర్మించుకోవడంలో మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కాకినాడ క్రియ పిల్లల పండగ అధ్యక్షులు ఎస్‌ఎ్‌సఆర్‌ జగన్నాథరావు మాట్లాడుతూ, పిల్లలకు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండా చదువులో ఏకాగ్రత, పరిపూర్ణత ఉండదన్నారు. కెనరాబ్యాంకు జీఎం సీజే విజయలక్ష్మి, ఏపీ యంఎ్‌సయంఈ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు బాయన వెంకట్రావు తదితరులు మాట్లాడారు. మూడోరోజు మాప్‌, సైన్సు ఎగ్జిబిషన్‌, డిబేట్‌, క్విజ్‌, తెలుగులో మాట్లాడటం, పద్య భావం, కథ చెప్పడం, మెమరీ టెస్ట్‌, నాటకీకరణ, ఇన్‌స్ట్రమెంట్‌మ్యూజిక్‌, ఏకపాత్రాభినయం, జానపదగీతాలాపన,కోటాలటం మూకాభినయం పోటీలు నిర్వహించారు. బాలోత్సం అధ్యక్షులు ఎస్పీ రామరాజు, ప్రధాన కార్యదర్శి రామిశెట్టి కొండలరావులు విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో 400 పాఠశాలల నుంచి 12వేలమంది పిల్లలు, యాజమాన్యాలు పాల్గొన్నాయి.

Updated Date - Nov 18 , 2024 | 12:20 AM