Share News

కృష్ణానదిలో వృద్ధుడి మృతదేహం

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:46 AM

దక్షిణ చిరువోలులంక వద్ద కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించినట్టు సామాజిక మాధ్యమాల్లో ఫొటో వైరల్‌ కావటంతో మృతుని బంధువులు గుర్తించారు.

కృష్ణానదిలో వృద్ధుడి మృతదేహం

అవనిగడ్డ, సెప్టెంబరు 11: దక్షిణ చిరువోలులంక వద్ద కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించినట్టు సామాజిక మాధ్యమాల్లో ఫొటో వైరల్‌ కావటంతో మృతుని బంధువులు గుర్తించారు. ఆ మృతదేహానికి దహన సంస్కా రాలు పూర్తి చేశారు. ‘‘బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన మన్నె పూర్ణచంద్రరావు(70) మోపిదేవి వెళ్లొస్తానని చెప్పి, నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయలుదేరాడు. అప్పటి నుంచి కనిపించకపోవటంతో మేము వెతుకుతున్నాం. బుధవారం ఉదయం దక్షిణ చిరువోలులంకలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించినట్టు సామాజిక మాధ్యమాల్లో ఫొటో వైరల్‌ అయ్యింది. దీంతో వెళ్లి చూశాం. అది మా నాన్నదిగా గుర్తించామ.’’ అని కుమార్తె రూపశ్రీ తెలిపారు. పూర్ణచంద్రరావుకు భార్య ఉమాదేవి, కుమార్తె రూపశ్రీ ఉన్నారు. కొంతకాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని వారు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన అనంతరం దక్షిణ చిరువోలులంక వద్ద దహన సంస్కారాలు పూర్తి చేశారు.

Updated Date - Sep 12 , 2024 | 08:13 AM