Share News

AP News: మచిలీపట్నంలో ఉద్రిక్తత... అక్రమకట్టడాలపై సర్కార్ ఉక్కుపాదం

ABN , Publish Date - Dec 06 , 2024 | 12:31 PM

Andhrapradesh: మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత వారం, పది రోజుల క్రితం అక్రమ కట్టడాలను తొలగించాలని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులకు అక్రమార్కులు స్పందించకపోవటంతో ప్రొక్లైన్లతో కట్టడాలను అధికారులు కూల్చివేశారు. అయితే కోర్టు స్టే ఉన్నా తమ కట్టడాలను కూల్చివేశారంటూ బాధితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ పేర్ని కిట్టు బాధితుల పక్షాన నిలిచారు.

AP News: మచిలీపట్నంలో ఉద్రిక్తత... అక్రమకట్టడాలపై సర్కార్ ఉక్కుపాదం
Demolition of illegal structures in Machilipatnam

కృష్ణా, డిసెంబర్ 6: జిల్లాలోని మచిలీపట్నంలో అక్రమకట్టడాలపై కూటమి సర్కార్ (AP Govt) ఉక్కుపాదం మోపుతోంది. మచిలీపట్నంలో మరోసారి అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. స్థానిక జడ్పీ సెంటర్‌లో చెరువును ఆక్రమించుకుని గత కొన్నేళ్లుగా అక్రమ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. హైడ్రా తరహా కూల్చివేతలతో అక్రమార్కులు హడలెత్తిపోతున్నారు.

ఏనుగుల కదలికలపై డ్రోన్ల నిఘా..


గత వారం, పది రోజుల క్రితం అక్రమ కట్టడాలను తొలగించాలని మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులకు అక్రమార్కులు స్పందించకపోవటంతో ప్రొక్లైన్లతో కట్టడాలను అధికారులు కూల్చివేశారు. అయితే కోర్టు స్టే ఉన్నా తమ కట్టడాలను కూల్చివేశారంటూ బాధితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ పేర్ని కిట్టు బాధితుల పక్షాన నిలిచారు. ఇటీవలే మూడు స్థంభాల సెంటర్ సమీపంలో 150 కు పైగా అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే.


కాగా.. మచిలీపట్నంలో అక్రమకట్టడాలపై అధికారులు దృష్టిపెట్టారు. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా, ఎటువంటి అనుమతులు లేకుండా కేవలం స్థానిక ప్రజాప్రతినిధులకు ముడుపులు ఇచ్చి మరీ చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ప్రదానంగా నివాసాలతో పాటు వ్యాపార కేంద్రంగా మార్చేశారు. ఈ నేపథ్యంలో స్థలాలు కేటాయించినందుకు గాను స్థానిక వైసీపీ నేతలు అద్దెలు వసూలు చేస్తూ ప్రభుత్వ ధనాన్ని ప్రైవేటు ధనంగా దోచుకున్నారు. దీనిపై దృష్టి సారించిన అధికారులు ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మచిలీపట్నం జెడ్పీసెంటర్‌లో చెరువును ఆక్రమించి ఉన్న వ్యాపార సముదాయాలను పూర్తిగా కూల్చివేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లో హైడ్రా తరహా అమలు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం.. మంత్రి నారాయణ ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా చెరువులు, కాలువులను ఆక్రమించినా.. వాటిని పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. నివాస ప్రాంతాలు ఉంటే వారికి ప్రత్యేకంగా ఇళ్లు కేటాయిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ సహా మచిపట్నంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు.


అయితే ప్రత్యామ్నాయం చూపితే వెళ్లిపోతామని చాలా మంది చెబుతున్నారు. కానీ వైసీపీకి అనుకూలంగా ఉన్నవారు మాత్రం ధర్నాకు అవకాశం ఉందనే సమాచారంతో పోలీసుల భద్రత నడుమ అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు. అయితే వ్యాపార సముదాయాలకు ప్రత్యామ్నాయం ఉండదని.. ఒకవేల వ్యాపారాలు ఉంటే కొంత మేర ఆదుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో అక్రమ కట్టడాల కూల్చివేతలు చేపట్టారు. వారం రోజులు గడువు ఇస్తామని.. ఆక్రమణలను తొలగించకపోతే చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. దీంతో కొంతమంది స్వచ్చంధంగానే వ్యాపార సముదాయాలను తీసివేస్తుండగా.. మరికొందరు మాత్రం వాగ్వివాదానికి దిగారు. దీంతో వారి పట్ల హైడ్రా తరహాలో ప్రొక్లైన్‌తో నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

వైసీపీ నేతల్లో ఉలిక్కిపాటు..

భవిష్యత్తులో ఆ దేశం అంతరించిపోతుంది.. ఎలాన్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 06 , 2024 | 12:31 PM