Share News

Pawan: ప్రతీసారి మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు

ABN , Publish Date - Dec 11 , 2024 | 12:24 PM

Andhrapradesh: సీఎం చంద్రబాబుతో గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై ఏపీ ప్రభుత్వం సంతకాలు చేసింది. కలెక్టర్ కాన్ఫరెన్సన్‌కు ముందు చంద్రబాబు నివాసంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాలపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి.. సీఎంకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Pawan: ప్రతీసారి మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు
Deputy CM Pawan Kalyan

అమరావతి, డిసెంబర్ 11: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు (CM Chandrababu Naidu) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ప్రత్యేక అభినందలు తెలియజేశారు. ‘‘రాష్ట్రానికి గూగుల్‌‌ను తీసుకువచ్చేందుకు మీరు చేసిన ప్రయత్నం అభినందనీయం. ప్రతిసారి మీరు మీ సామర్ధ్యాన్ని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు’’ అంటూ సీఎంను పవన్ పొగడ్తలతో ముంచెత్తారు. బుధవారం ఉదయం సీఎం చంద్రబాబుతో గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై ఏపీ ప్రభుత్వం సంతకాలు చేసింది. కలెక్టర్ కాన్ఫరెన్సన్‌కు ముందు చంద్రబాబు నివాసంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాలపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి.. సీఎంకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Mohan babu: హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు


అనంతరం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పవన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేశారన్నారు. రెవన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు అమ్మించారని మండిపడ్డారు. దీనిపై నాడు ఐఏఎస్‌లు ఎందుకు మాట్లాడలేదు అని అనిపించేదన్నారు. ప్రజల నిస్సాహయత నాడు రోడ్లపైకి వచ్చిందన్నారు. రాజకీయ పాలన ఫెయిల్ అయితే అడ్మినిష్ట్రేషన్ దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలన్నారు. అయితే అలా చేయకపోవడం వల్ల రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు అప్పులు వచ్చాయని తెలిపారు. ఈ గుణపాఠం ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలని లేకపోతే ప్రజలే తిరగబడతారన్నారు. సిరియా, శ్రీలంకలలో ఏం జరిగిందో చూశామన్నారు. సైబరాబాద్‌లో రాళ్లు, రప్పల మధ్య ఓ నగరాన్ని సీఎం చూడగలిగారన్నారు. ‘‘అధికారుల సపోర్టు ఈ ప్రభుత్వానికి కావాలి... దీని కోసం మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నా’’ అని పవన్ అన్నారు.

అదే పనిలో ఉన్నా.. కౌంటర్ అదిరింది


కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ మూడు చెక్ పోస్టులు పెట్టాక కూడా స్మగ్లింగ్ జరుగుతుంటే కలెక్టర్‌లు, ఎస్పీలు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కాకినాడ పోర్టులో ఎలా కసబ్ ఎంటర్ అయ్యాడో అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. నాడు జరిగిన సంఘటన వల్ల 300 మంది ప్రాణాలు పోయారని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

జగన్‌ నిర్వాకం.. అమరావతిపై భారం..

టాప్ 5లో.. ‘యే పవన్ నహీ ఆంధీ హై’

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 01:38 PM