Pawan: చంద్రబాబు వెన్నంటే ఉంటా
ABN , Publish Date - Dec 13 , 2024 | 04:39 PM
Andhrapradesh: స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుల, మత, ప్రాంతాల పరంగా కొట్టుకునే రోజులు ఇక పోయాయన్నారు. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితులు ఇక ఉండవన్నారు. చంద్రబాబుకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుషుతో పాటు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
అమరావతి, డిసెంబర్ 13: రాష్ట్రానికి తక్కువలో తక్కువగా దాదాపు రెండున్నర దశాబ్ధాల పాటు రాజకీయ సుస్థిరత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుల, మత, ప్రాంతాల పరంగా కొట్టుకునే రోజులు ఇక పోయాయన్నారు. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితులు ఇక ఉండవన్నారు. చంద్రబాబుకు (CM Chandrababu) భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుషుతో పాటు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Formula E: గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. కేటీఆర్ అరెస్ట్ తప్పదా
‘‘చంద్రబాబు నా గౌరవ మర్యాదలు ఎక్కడా తగ్గకుండా చూస్తూ నన్ను నమ్మిన ప్రజలకూ గౌరవం ఇస్తున్నారు. అలాంటి చంద్రబాబు గౌరవం నేను ఏ రోజూ తగ్గించను’’ అని స్పష్టం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలో ఉన్న అన్ని స్థాయిల్లో నాయకులు చంద్రబాబుతో తానెలా కలిసి పనిచేస్తున్నానో అలాగే సమష్టిగా కలిసి పనిచేయాలని కోరారు. అప్పుడప్పుడు కొన్ని సమస్యలున్నా వాటిని అధిగమించి వెళ్లటమే ప్రజలు మనకిచ్చిన ఎన్నికల ఫలితాన్ని సాకారం చేయటం అని అన్నారు.
చంచల్‌గూడ జైలుకు అల్లు అర్జున్
వేదిక మీద ఉన్న వాళ్లమంతా ఒకే మాట మీద ఉన్నాం, చంద్రబాబు వెన్నంటే ఉన్నామని తెలిపారు. అంతా కలిసి ప్రధాని మోదీ కనే వికసిత్ భారత్ కలను సాకారం చేస్తామన్నారు. మోదీ ఆకాంక్ష నెరవేరాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయకత్వంలో బలంగా ఉండాలని తెలిపారు. అద్భుతమైన 2047 విజన్ సాకార యాత్రలో చంద్రబాబు వెన్నంటే ఉంటా అని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
మహా సంకల్పం...
ప్రజల జీవితాలు బాగుపడాలంటే సరైన సారధ్యం వహించే మహానాయకుడు సీఎం చంద్రబాబు అని ఉపముఖ్యమంత్రి అన్నారు. విజన్ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ కోట్లాది మంది కలలను సాకారం చేసే మహాసంకల్పమన్నారు. పార్టీ పెట్టి తాను నలిగిన తర్వాతే చంద్రబాబు విలువేంటో మరింత తెలిసి ఆయనపై అపార గౌరవం పెరిగిందని చెప్పుకొచ్చారు. పార్టీ నడపటం అంటే ఆత్మహత్యా సద్రుశ్యంతో సమానమన్నారు. ప్రతీ ఒక్కరికీ దిక్సూచీ అవసరమన్నారు. విజన్ 2020 నాడు తన స్థాయికి అర్థం కాలేదని తెలిపారు.
చంద్రబాబు ఆయన కోసం కలలు కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్న మహానాయకుడని విజన్ 2020 ఫలితాల ద్వారా అర్థమైందన్నారు. నాడు రాళ్లు రప్పలు చూసిన ప్రాంతంలో చంద్రబాబు సైబర్ సిటీ మహానగరాన్ని చూశారన్నారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సైబరాబాద్ రూపకర్త, శిల్పి, చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబే అంటూ కొనియాడారు. ఎంతో కష్టపడి కట్టిన ట్విన్ టవర్స్‌ను ఉగ్రవాదులు ఒక పూటలోనే కూల్చేశారని.. నిర్మాణం విలువ తెలియని గత పాలకులూ ఇదే మాదిరి వ్యవహరించారన్నారు. ‘‘చంద్రబాబు ఓపికను ఎన్నిసార్లు మెచ్చుకున్నా సరిపోదు, మేం మా కోసం కలలు కంటే ఆయన ప్రజల కోసం కలలు కంటున్నారు. అలాంటి అనుభవజ్ఞుడి వద్ద పనిచేయటం ఎంతో గర్వంగా ఉంది’’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
భయంతో పేర్ని ఫ్యామిలీ పరార్..!
జగన్ అక్రమాస్తుల కేసు... తాజా అప్‌డేట్ ఇదే
Read Latest AP News And Telugu News