Pawan: దేవేంద్ర ఫడ్నవీస్‌కు పవన్ శుభాకాంక్షలు
ABN , Publish Date - Dec 05 , 2024 | 03:02 PM
Andhrapradesh: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవంద్ర ఫడ్నవీస్ ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా దేవంద్రకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ఆయన విజన్ స్ఫూర్తి తో ఫడ్నవీస్ డైనమిక్ నాయకత్వం మహారాష్ట్ర పురోగతిని కొత్త శిఖరాలవైపు నడిపిస్తుందని ఆకాంక్షించారు.
అమరావతి, డిసెంబర్ 5: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్న దేవేంద్ర ఫడ్నవీస్‌కు (Devendra Fadnavis) ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawankalyan) శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ (PM Modi) మార్గదర్శకత్వంలో ఆయన విజన్ స్ఫూర్తి తో ఫడ్నవీస్ డైనమిక్ నాయకత్వం మహారాష్ట్ర పురోగతిని కొత్త శిఖరాలవైపు నడిపిస్తుందని ఆకాంక్షించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు. సింగపూర్‌లో చదువుకుంటున్న తన కుమారుడు విద్యాసంస్థ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున ముంబై వెళ్లలేకపోతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
YS Sharmila: ఆ ఒప్పందాలపై నిజాలు నిగ్గు తేలాల్సిందే..
ముంబైకి సీఎం చంద్రబాబు
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబై బయలుదేరి వెళ్లారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు. సాయంత్రం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని రాత్రికి ముంబై నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్లనున్నారు. రాత్రికి జిల్లా పార్టీ తెలుగుదేశం కార్యాలయంలో చంద్రబాబు బస చేయనున్నారు. రేపు (శుక్రవారం) విశాఖలో జరిగే ‘డీప్‌టెక్’ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
సాయంత్రం 5:30కు ప్రమాణస్వీకారం
కాగా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై ఆజాద్ గ్రౌండ్స్‌లో ప్రమాణస్వీకారోత్సవం జరుగనుంది. సాయంత్రం 5:30 గంటలకు మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేయనున్నారు. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేస్తారు. మహారాష్ట్ర సీఎంగా మూడో సారి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేస్తారు. 2014 నుంచి 2019 వరకు తొలిసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పని చేశారు. మహా సర్కార్ ఏర్పాటు కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా ఎన్డీయే ముఖ్య నేతలు హాజరుకానున్నారు. డిసెంబర్ 16 నుంచి నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ 12లోగా మంత్రివర్గ కూర్పును పూర్తిచేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి...
AirHelp Survey: ప్రపంచ ఎయిర్‌లైన్స్ సర్వేలో షాకింగ్ విషయాలు
Polavaram: పోలవరంపై కేంద్రం నుంచి తాజా అప్‌డేట్..
Read Latest AP News And Telugu News