Share News

ఘోరంగా ఓడిపోయినా బుద్ధి రాలేదా?

ABN , Publish Date - Aug 12 , 2024 | 01:21 AM

ప్రజలు ఎన్నికల్లో ఘోరంగా ఓడించినా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, అరుణ్‌కుమార్‌ సోదరులకు ఇంకా బుద్ధి రాలేదని టీడీపీ నందిగామ ఎస్సీ సెల్‌ నాయ కులు విమర్శిం చారు.

ఘోరంగా ఓడిపోయినా బుద్ధి రాలేదా?

దళితులపై దాడులు జరిగినప్పుడు ఏమయ్యారు

అంబేడ్కర్‌ విగ్రహంపై జగన్‌ పేరు తొలగించగానే సిగ్గులేకుండా ర్యాలీలు చేస్తున్నారు

మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, అరుణ్‌కుమార్‌పై టీడీపీ ఎస్సీ సెల్‌ నాయకుల విమర్శ

నందిగామ, ఆగస్టు 11: ప్రజలు ఎన్నికల్లో ఘోరంగా ఓడించినా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, అరుణ్‌కుమార్‌ సోదరులకు ఇంకా బుద్ధి రాలేదని టీడీపీ నందిగామ ఎస్సీ సెల్‌ నాయ కులు విమర్శిం చారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. అంబేడ్కర్‌ విగ్రహంపై జగన్‌ పేరును పెద్ద అక్షరాలతో ఏర్పాటు చేయడం ఇష్టం లేని కొందరు ఆ పేరు తొలగించారని, ఆ ఘట నను టీడీపీకి ఆపాదించడం మానుకోవాలని వారు సూచించారు. అధికా రంలో ఉండగా దళితులపై దాడులు జరిగినప్పుడు స్పందించడం చేతగాని సోదరులిద్దరూ జగన్‌ పేరును తొలగిస్తే క్యాండిల్‌ ర్యాలీలు చేయడం హేయమన్నారు. అధికారంలో ఉండగా భారీ అవినీతి చేసి ప్రజల ఛీత్కారానికి గురైనా సిగ్గులేకుండా ర్యాలీలు చేస్తూ, రాజకీయ లబ్ధికి పాకు లాడుతున్నారన్నారు. నీచరాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. న్యాయవాది రాజు, దారెల్లి బుజ్జి, గాంధీ, లవ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2024 | 01:21 AM