Share News

సమస్యల పరిష్కారంలో అలసత్వమొద్దు

ABN , Publish Date - Dec 21 , 2024 | 01:07 AM

రాజధాని అమరావతి రైతులు, రైతుకూలీలు గ్రీవెన్స్‌డేలో విన్నవించిన సమస్యలను పరిష్కరించడంలో అలస త్వం వద్దని, సత్వరమే పరిష్కరించాలని అధికారులను సీఆర్డీయే అదనపు కమిషనర్‌ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ ఆదేశించారు.

సమస్యల పరిష్కారంలో అలసత్వమొద్దు
గ్రీవెన్స్‌ డేలో రైతుల సమస్యలు వింటున్న సీఆర్డీయే అదనపు కమిషనర్‌ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌

అధికారులకు సీఆర్డీయే అదనపు కమిషనర్‌ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ ఆదేశం

కృష్ణలంక, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి రైతులు, రైతుకూలీలు గ్రీవెన్స్‌డేలో విన్నవించిన సమస్యలను పరిష్కరించడంలో అలస త్వం వద్దని, సత్వరమే పరిష్కరించాలని అధికారులను సీఆర్డీయే అదనపు కమిషనర్‌ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ ఆదేశించారు. శుక్రవారం తుళ్లూరు సీఆర్డీయే ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో రాజధాని రైతులు సమస్యలను అదనపు కమిషనర్‌కు విన్నవించారు. ప్రతి శుక్రవారం ఉదయం 10 గం టల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే గ్రీవెన్స్‌ డేను రైతులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. సీఆర్డీయేలోని వివిధ విభాగాల అధికారులు సమస్యల్లో అధిక శాతం అక్కడికక్కడే పరిష్కరించారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు జి.భీమారావు, జి.రవీంద్ర, ఎ.జి.చిన్నికృష్ణ, పి.పద్మావతి, కె.ఎ్‌స.భాగ్యరేఖ, బి.హుస్సేన్‌ సాహెబ్‌, కె.స్వర్ణమేరి, బి.సాయిశ్రీనివా్‌సనాయక్‌, ల్యాండ్‌ సర్వే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జి.పి.రామకృష్ణన్‌, డీసీడీవో బొర్రా శ్రీనివాసరావు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2024 | 01:07 AM