Share News

గత పాలకుల నిర్లక్ష్యం వల్లే 4 వేల ఎకరాలు బీడుగా మారింది

ABN , Publish Date - Jun 15 , 2024 | 01:59 AM

గత పాలకుల నిర్లక్ష్యం వల్లే 4 వేల ఎకరాల సాగు భూమి బీడుగా మారిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్‌ ఆరోపిం చారు.

గత పాలకుల నిర్లక్ష్యం వల్లే 4 వేల ఎకరాలు బీడుగా మారింది
పాలకాయితిప్ప అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌

కోడూరు, జూన్‌ 14: గత పాలకుల నిర్లక్ష్యం వల్లే 4 వేల ఎకరాల సాగు భూమి బీడుగా మారిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్‌ ఆరోపిం చారు. శుక్రవారం కోడూరు మండలంలో సాగు చేయకుండా బీడుగా మారిన పొలా లను, పంట కాలువలను, పాలకాయితిప్ప అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌లను ఆయన పరి శీలించారు. మండలంలో బీడుబారిన భూములకు సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చానని, వాటిని నెరవేర్చేందుకు అధికారులతో పర్యటిస్తున్నానని మండలి తెలి పారు. ప్రస్తుతం రూ.43.30 లక్షలతో కోడూరు ప్రధాన పంటకాలువ మరమ్మతులు, నరసింహాపురం లింగన్నకోడుపై వంతెనిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. రైతులకు తాత్కాలికంగా ఊరట కలిగించేందుకు నాలుగు వేల ఎకరాల్లో సాగు చేసుకునేలా తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు. వచ్చే ఏడాదికి సముద్రపు ఉప్పునీరు పంట పొలాల్లోకి చేరకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి రైతుల సమస్యలు తీసుకెళ్లి అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌ నిర్మాణ పనులు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపుతానని మండలి హామీ ఇచ్చారు. గతంలో రైతుల దీన స్థితిని చూసి ఎంపీ బాలశౌరి నిధులు మంజూరు చేస్తానని చెబితే, దానికి స్థానిక ఎమ్మెల్యే సంతకం కావాలని. గ్రామ పంచాయతీ తీర్మానం కావాలని కోరారని, స్థానిక ఎమ్మెల్యే దానికి అడ్డుపడి సంతకం చేయలేదని, పంచాయతీ తీర్మానం చేయనివ్వలేదని రైతులు తెలిపారు. ఈ ఏడాది ప్రతీ ఎకరానికి సాగునీరు అందిం చేందుకు కృషిచేస్తానని బుద్ధప్రసాద్‌ హామీ ఇచ్చారు. మండలి వెంకట్రామ్‌, బండే శ్రీనివాసరావు, మర్రే గంగయ్య, ఉల్లి శేషగిరిరావు, గోగినేని సోమశేఖరరావు, పిల్లి మల్లికార్జునరావు, కొక్కిలిగడ్డ సముద్రాలు, విజ్జినేని శివాజీ, దామెర్ల నారాయణ, మద్దూరి కాంతారావు, ముద్దినేని చంద్రరావు, ఇరిగేషన్‌ డీఈఈ రావెళ్ల రవికిరణ్‌, డ్రెయినేజీ డీఈ పులిగడ్డ వెంకటేశ్వరరావు, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2024 | 01:59 AM