ఎన్నికల కోడ్ అమల్లోకి
ABN , Publish Date - Mar 17 , 2024 | 01:08 AM
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) అమల్లోకి వచ్చేసింది. ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి ఆదేశాలను జిల్లాల ఎన్నికల యంత్రాంగం శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అమల్లోకి తెచ్చింది. షెడ్యూల్ విడుదల చేసిన 24 గంటల్లోపు ప్రవర్తనా నియమావళిని అమల్లోకి తీసుకురావాలని ఎన్నికల సంఘం ఆదేశించటంతో ఆదివారం మధ్యాహ్నా నికి నూరు శాతం కోడ్ అమలు దిశగా రెండు జిల్లాల ఎన్నికల యంత్రాం గం చర్యలు చేపడుతోంది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుంది.
శాఖల వారీగా ప్రవర్తనా నియమావళి అమలుకు కలెక్టర్ల ఆదేశాలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్, జాయింట్ కలెక్టరేట్, సబ్ కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాలు, రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ముఖ్యమంత్రి జగన్ బొమ్మల తొలగింపు చేపట్టారు. నవరత్నాల పథకాల లోగోలను తొలగించారు. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖలు, విద్య, వైద్య, రవాణా, సమాచార శాఖలు శనివారం 4 గంటల నుంచే వీటి తొలగింపు చేపట్టాయి. గ్రామ సచివాలయాలతో సహా సీఎం ఫొటోలు, నవరత్నాలు లోగోలు, ఇతర వినైల్ బ్యానర్స్, హోర్డింగ్స్ తొలగింపు ప్రారంభించారు. జంక్షన్లు, బస్టాండ్స్, రైల్వేస్టేషన్లలోనూ, బస్సులు, రైళ్లపై రాజకీయపార్టీల అనధికారిక ప్రకటనలు ఉంటే 48 గంటల్లోగా తొల గించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ దిల్లీరావు ఆదేశించారు. జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి ఫొటోలను ప్రభుత్వ వెబ్‌సైట్స్ నుంచి తొల గించాలని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు అన్ని రకాల బోర్డుల తొలగింపు పనులను చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలపై పథకాల ప్రచార వాల్ రైటింగ్స్, వాల్ పోస్టర్లు తొలగింపునకు ఆదేశించారు. పథకాల ప్రచారాలకు సంబంధించిన హోర్డింగ్‌లను, బ్యానర్లు, జెండాలు, బెలూన్లను తక్షణం తొలగించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేయాలని ఆదేశించారు. ఆదివారం మధ్యా హ్నానికి పూర్తిస్థాయిలో విగ్రహాలకు ముసుగులు తొడగనున్నారు.
అభివృద్ధి పనుల నివేదిక కోరిన కలెక్టర్
జిల్లావ్యాప్తంగా అభివృద్ధి పనులపై ఆయా శాఖలు 72 గంటల్లోపు తనకు వివరాలు పంపించాలని కలెక్టర్ దిల్లీరావు ఆదేశించారు. నిర్మాణ రం గానికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్‌లో చేపట్టిన అభివృద్ధి పనులు, నిధులు మంజూరైనా ఇంకా పనులు మొదలు కాని వాటి వివరాలను రెండు వేర్వేరు జాబితాల్లో పంపాలని ఆయన సూచించారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు శాంక్షనై గ్రౌండ్‌లో అప్పటికే పనులు మొదలైతే కోడ్ వచ్చినా ఇబ్బంది ఉండదు. కోడ్ వచ్చాక పనులు చేపట్టినా, గతంలో శాం క్షనై ఇప్పటి వరకు చేపట్టకపోతే మాత్రం మొదలుపెట్టకూడదు.
ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లు రాజకీయ నాయకులకు ఇవ్వొద్దు
విజయవాడలోని ప్రభుత్వ అతిథి గృహాన్ని, ఆర్‌అండ్‌బీ, పోలీసు తదితర అతిథి గృహాలను రాజకీయ పార్టీల నాయకులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులకు కేటాయించకూడదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికలకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సిద్ధం
ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఎన్టీఆర్ జిల్లాలో తదుపరి ఎన్నికల ప్రక్రియకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సిద్ధమైంది. ప్రవర్తనా నియమావళి అమలుతో పాటు నోటిఫికేషన్ అనంతర విఽధులపై దృష్టి సారించింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నోడల్ ఆఫీసర్లంతా ఒకేచోట పనిచేయటానికి వీలుగా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. కొద్ది రోజులుగా జిల్లా ఎన్నికల యంత్రాంగం దీని పనులు చేపట్టింది. గతంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక చాంబర్‌నే ఆధునీకరించారు. సెంట్రలైజ్డ్ ఏసీ సదుపాయం కల్పించారు. సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 16 మంది నోడల్ ఆఫీసర్లను నియమించారు. వీరంతా ఇక్కడే విధులు నిర్వహిస్తారు. సోమవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణ 16 మంది నోడల్ ఆఫీసర్ల కనుసన్నల్లో నడుస్తుంది. ఎలక్షన్ మ్యాన్‌పవర్ మేనేజ్ మెంట్, ట్రెయినింగ్ మేనేజ్‌మెంట్, మెటీరియల్ మేనేజ్‌మెంట్, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, కంప్యూటరైజేషన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, స్వీప్ మేనేజ్‌మెంట్, లా అండ్ ఆర్డర్, వీఎం అండ్ సెక్యూరిటీ ప్లాన్ మేనేజ్ మెంట్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ) మేనేజ్‌మెంట్, ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్, బ్యాలెట్ పేపర్, పోస్టల్ బ్యాలెట్ మేనే జ్‌మెంట్, మీడియా మేనేజ్‌మెంట్, కమమ్యూనికేషన్ ప్లాన్, ఎలక్ర్టోరల్ రోల్స్ మేనేజ్‌మెంట్, కంప్ల యింట్ రెడ్రసల్-ఓటర్ హెల్ప్‌లైన్ మేనేజ్‌మెంట్, ఎలక్షన్ ఆబ్జర్వర్స్ మేనేజ్ మెంట్ వ్యవహారాలన్నింటినీ ఈ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ వేదికగానే నోడల్ ఆఫీసర్లు చక్కబరుస్తారు.
డీపీఆర్వో కార్యాలయంలో ఎంసీఎంసీ సెల్
జిల్లా పౌరసంబంధాల శాఖ (డీపీఆర్వో) కార్యాలయంలో మీడియా సర్టిఫికెట్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) సెల్‌ను ఏర్పాటు చేశారు. ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియాలో వచ్చే కథనాలను పరిశీలిస్తూ పెయిడ్ ఆర్టికల్స్, స్టోరీలను ఎంసీఎంసీ సెల్ గుర్తిస్తుంది. మీడియాకు ఇచ్చే ప్రకట నల ఖర్చులను లెక్కిస్తుంది. డీపీఆర్వో కార్యాలయంలో మీడియా సమా చారం కోసం సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయటానికి సమాచార శాఖ అధికారులు సురేంద్ర, మోహనరావు, రవి, ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు.
సీఎం బొమ్మ తీయాల్సిందే
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో లబ్ధిదా రులకు ఇచ్చే బెనిఫిషియరీ కార్డులు, ధ్రువీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండకూడదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో జారీ చేసే అన్ని రకాల సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి బొమ్మలు ఉన్నాయి. మరణ ధ్రువీకరణ పత్రా ల్లోనూ ముఖ్యమంత్రి ఫొటోలు ఉంటున్నాయి. ఈ బొమ్మలు ఇకపై ఉండటానికి లేదు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ జిల్లా అధికారులు ముఖ్య మంత్రి బొమ్మలు లేని ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలి. గ్రామ వార్డు సచివాలయాలపై ముఖ్యమంత్రి బొమ్మలను ఏర్పాటు చేశారు. వాటిని, సచివాయాలయాలు, వాటర్ ట్యాంకులు, గోడలకేసిన వైసీపీ రంగులను తొలగించాల్సిందే.