Share News

నల్లబ్యాడ్జీలతో విధులకు ఉద్యోగులు

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:39 AM

ఎపీఎన్జీవో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యోగ సంఘాల సభ్యులు నల్లబ్యాడ్జీలతో బుధవారం విధులకు హాజరయ్యారు.

నల్లబ్యాడ్జీలతో విధులకు ఉద్యోగులు
జగ్గయ్యపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఉద్యోగుల నిరసన

తిరువూరు, ఫిబ్రవరి 14: ఎపీఎన్జీవో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యోగ సంఘాల సభ్యులు నల్లబ్యాడ్జీలతో బుధవారం విధులకు హాజరయ్యారు. 12వ పీఆర్సీలో మధ్యంతర భృతిలో 30శాతం తక్షణం చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలు నగదు రూపంలో చెల్లించాలని, ఉపాధ్యాయులకు అప్రెంటీస్‌ విధానం రద్దుచేయాలని, జీవో 117 రద్దు చేయాలన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ ప్రకాష్‌బాబుకు అందించారు. ఎన్‌జీవో నాయకులు మిరియాల గోపాలకృష్ణ, ఎం.ప్రకాష్‌బాబు, గంధం పుల్లయ్య, ఎ.రామచంద్రారావు, వాసుదేవరావు, పణికుమార్‌, రిటైర్డ్‌ ఉద్యోగులు కంవృద్దీన్‌, యండ్రాతి రామారావు, బడుగు రాములుపాల్గొనానరు.

జగ్గయ్యపేటలో..

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక , సచివాలయ ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ జేఏసీ పిలుపు మేరకు బుధవారం ఉద్యోగులు నలబ్యాడ్జీలు ధరించి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు బాబురావు, ఆర్‌.శ్రీనివాసరావు, విజయవర్ధన్‌, కుమార్‌, వెంకటరామయ్య, క్రిష్ణయ్య, సుధానంద్‌, ఏ.నరసింహారావు, ఉషారాణి, పుల్లారావు, వామన్‌ తదితరులు పాల్గొని తహసీల్ధార్‌ జీవీ శేషుకు వినతిపత్రం అందచేశారు.

విస్సన్నపేటలో..

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీ పిలుపు మేరకు బుధవారం విస్సన్నపేట తాలూకా యూనిట్‌ పరిధిలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు నిరసన కొనసాగిస్తామన్నారు. యూనిట్‌ అధ్యక్షుడు కె.రవికుమార్‌, కార్యదర్శి ఫణికుమార్‌, సహాధ్యక్షుడు అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 12:39 AM