Share News

సమస్యను సీఎంకు వివరిస్తా

ABN , Publish Date - Dec 24 , 2024 | 12:52 AM

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి రెండు, మూడురోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి లయోలా వాకర్స్‌ సమస్యను తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) హామీ ఇచ్చారు.

సమస్యను సీఎంకు వివరిస్తా
లయోలా వాకర్స్‌తో మాట్లాడుతున్న ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని)

లయోలా వాకర్స్‌కు ఎంపీ కేశినేని చిన్ని హామీ

భారతీనగర్‌, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి రెండు, మూడురోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి లయోలా వాకర్స్‌ సమస్యను తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) హామీ ఇచ్చారు. జీవో ఎంఎస్‌ 18 ప్రకారం లయోలా కాలేజీలో వాకింగ్‌కు అనుమతి ఇప్పించాలని గూడపాటి లక్ష్మీనారాయణ, గూడపాటి తులసీమోహన్‌, రావి రమేష్‌ ఆధ్వర్యంలో లయోలా కాలేజీ వాకర్స్‌ భారీసంఖ్యలో గురునానక్‌ కాలనీలోని పార్లమెంట్‌ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో సోమవారం ఎంపీ కేశేనేని చిన్నిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. 30 ఏళ్లుగా ఎంతోమంది సీనియర్‌ సిటిజన్స్‌ లయోలా కళాశాలలో కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా వాకర్స్‌ అసోసియేషన్‌గా ఏర్పడి వాకింగ్‌ చేసుకునేవారని, కరోనా రాకముందు వరకు కళాశాల యాజమాన్యం సహకరించిందని, తర్వాత నుంచి వాకింగ్‌కు అనుమతించక పోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని అన్నారు. సీనియర్‌ సిటిజన్స్‌తో పాటు మహిళలు, ప్రజలు వాకింగ్‌ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కళాశాల యాజమాన్యాన్ని ఆయన కోరారు.

Updated Date - Dec 24 , 2024 | 12:52 AM