Share News

వరదలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN , Publish Date - Sep 20 , 2024 | 01:02 AM

బుడమేరు వరద ముంపు కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాం గాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీ ఎం, ఏపీ రైతు సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

వరదలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ప్రభుత్వానికి సీపీఎం, రైతు సంఘం విజ్ఞప్తి

హనుమాన్‌జంక్షన్‌, సెప్టెంబరు 19: బుడమేరు వరద ముంపు కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాం గాన్ని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని సీపీ ఎం, ఏపీ రైతు సంఘం బాపులపాడు మండల నాయకులు బేత శ్రీనివాసరావు, తోట సాంబశివరావు గురువారం ఓ ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కంటి తుడుపుచర్యగా వరికి ఎకరానికి రూ.10 వేలు, అపరా లకు రూ.6 వేలు, కూరగాయ పంటలకు రూ.4వేలు ప్రకటిం చడం అన్యాయమని వారు పేర్కొన్నారు. వరి సాగు చేసిన రైతులు ఎకరాకు రూ.25వేలు పెట్టుబడిగా పెట్టి నష్టపోయా రని, మళ్లీ వరినాట్లు వేసుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. నష్టపోయిన రైతులకు రూ.10వేలు ప్రకటిం చడం అన్యాయమని ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.

Updated Date - Sep 20 , 2024 | 07:48 AM