Share News

వైసీపీ ప్రచారంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌, వలంటీర్‌

ABN , Publish Date - Apr 07 , 2024 | 01:15 AM

అధికార యంత్రాంగం పదేపదే హెచ్చరిస్తున్నా, చర్యలు తీసుకుంటామని చెబుతున్నా గ్రామీణ ప్రాంతాల్లోని ఉద్యోగులు మాత్రం తమ వైఖరి వీడట్లేదు.

వైసీపీ ప్రచారంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌, వలంటీర్‌

ఎన్నికల అధికారులకు గ్రామస్థుల ఫిర్యాదు

జగ్గయ్యపేట రూరల్‌, ఏప్రిల్‌ 6 : అధికార యంత్రాంగం పదేపదే హెచ్చరిస్తున్నా, చర్యలు తీసుకుంటామని చెబుతున్నా గ్రామీణ ప్రాంతాల్లోని ఉద్యోగులు మాత్రం తమ వైఖరి వీడట్లేదు. తాజాగా జగ్గయ్యపేట రూరల్‌ మండలంలోని అన్నవరం గ్రామంలో శుక్రవారం రాత్రి స్థానిక వైసీపీ నేతల ఆధ్వర్యంలో జరిగిన ‘మేము సిద్ధం.. మా బూత్‌ సిద్ధం’ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌ చారుగుండ్ల కళావతి, వలంటీర్‌ బ్రహ్మం పాల్గొన్నారు. పాల్గొనడమే కాదు.. సీఎం జగన్‌ ఫొటోతో కరపత్రాలు పట్టుకుని ప్రచారం చేశారు. వీరిపై అధికారులకు ఫిర్యాదు చేశామని గ్రామస్థులు తెలిపారు.

Updated Date - Apr 07 , 2024 | 01:15 AM