Share News

Payyavula: ఏపీని పునర్మించేందుకు కలిసి పనిచేద్దాం

ABN , Publish Date - Dec 11 , 2024 | 02:16 PM

Andhrapradesh: చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు ఎంత తపనతో పని చేశారో ఇప్పుడూ అదే తపనతో ముందుకెళ్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రజల కోసమే జీవితం, ప్రతి పనిలోనూ మానవత్వం అనే లక్ష్యంతో పాలన అందిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వారసత్వంగా వచ్చిన ప్రధాన సమస్య రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పు అని అన్నారు.

Payyavula: ఏపీని పునర్మించేందుకు కలిసి పనిచేద్దాం
Minister Payyavula Keshava

అమరావతి, డిసెంబర్ 11: ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా కలెక్టర్ల సమావేశంలో చర్చించాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) అన్నారు. బుధవారం ఏపీ కలెక్టర్ల సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. 1994 నుంచి సీఎం చంద్రబాబుతో ప్రయాణం చేస్తున్నానని.. చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు ఎంత తపనతో పని చేశారో ఇప్పుడూ అదే తపనతో ముందుకెళ్తున్నారన్నారు. ప్రజల కోసమే జీవితం, ప్రతి పనిలోనూ మానవత్వం అనే లక్ష్యంతో పాలన అందిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వారసత్వంగా వచ్చిన ప్రధాన సమస్య రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పు అని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో 99 శాతం రాష్ట్ర ఆదాయం జీతభత్యాలకే సరిపోయిందన్నారు. అంతకుముందు రెండేళ్లు 107 శాతం రాష్ట్ర ఆదాయం జీతభత్యాలకే వెచ్చించారని చెప్పారు.

అమ్మ బాధలో ఉంది.. లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు


ఒక లక్షా 14 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారని.. వాస్తవ పరిస్థితులు చూస్తే చాలా బాధనిపిస్తోందని అన్నారు. అధికారంలోకి రాగానే అప్పులు, ఆగిపోయిన ప్రాజెక్టులు, మరోవైపు ప్రజల ఆశలు ఆకాంక్షలు ఎదురయ్యాయని తెలిపారు. మరో వ్యక్తి అయితే నిద్రపోలేని పరిస్థితి కానీ సీఎం చంద్రబాబు ప్రజాక్షేమమే ధ్యేయంగా కష్టపడుతున్నారన్నారు. . హైదరాబాద్ ట్రాన్స్ ఫార్మ్ చేసినట్టే రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తారన్నారు. ప్రభుత్వశాఖలు ప్రతీ రూపాయినీ జాగ్రత్తగా ఆలోచించి ఖర్చుపెట్టాలని సూచించారు. ఈ రాష్ట్రాన్ని పునర్మించడానికి అంతా కలసి పని చేద్దామన్నారు. సీఎం టీమ్‌గా ప్రజల కోసం పనిచేద్దామంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు.

తలకు గాయం.. హాస్పిటల్‌లో మోహన్ బాబు


పవన్ వార్నింగ్...

ఏపీ కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. స్మగ్లింగ్‌పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆఖరికి పెట్రోల్‌లో కూడా కల్తీ పెరిగిపోతోందని, స్వయానా మంత్రి నాదెండ్ర మనోహర్ వెళ్లి సీజ్ చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఇలాంటి కల్తీలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుకను స్ట్రీమ్ లైన్ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇన్నేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులు పాలైందని, అధికారులకు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్ షిప్‌లో ఏపీలో సుస్థిర పాలనను అందిచేందుకు అంతా సహకారం అందించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి...

Pawan: ప్రతీసారి మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు

AP highcourt: అదానీతో విద్యుత్ ఒప్పందాలపై హైకోర్టులో విచారణ.. ఏం జరిగిందంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 02:17 PM