Share News

మాజీ మంత్రి జోగి అండతో 50 ఎకరాల చెరువులో చేపలు దోచుకెళ్లారు

ABN , Publish Date - Sep 25 , 2024 | 01:17 AM

‘ధర్మవరం పట్టణంలోని నా ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుళ్లాయప్ప అనే దర్జీ నాపై అత్యాచారం చేశాడు. సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి పదేపదే నన్ను బెదిరిస్తున్నాడు’ అని ఓ మహిళ టీడీపీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహించారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, బీదా రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఆచంట సునీత వినతులు స్వీకరించారు.

మాజీ మంత్రి జోగి అండతో  50 ఎకరాల చెరువులో చేపలు దోచుకెళ్లారు

  • ఆలేరు కాలువకు 119 ఎకరాలు తీసుకున్నారు

  • నష్టపరిహారం అడిగితే అధికారులు దురుసుగా మాట్లాడుతున్నారు

  • అత్యాచారం చేసి, సెల్‌లో చిత్రీకరించి.. బెదిరిస్తున్నాడు

  • గ్రామంలో సీసీ రోడ్లకు 10 లక్షలు ఖర్చు చేశా

  • 2018 నుంచి ఇప్పటి వరకూ పైసా ఇవ్వలేదు

  • టీడీపీ గ్రీవెన్స్‌లో బాధితుల ఫిర్యాదులు

అమరావతి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘ధర్మవరం పట్టణంలోని నా ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుళ్లాయప్ప అనే దర్జీ నాపై అత్యాచారం చేశాడు. సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి పదేపదే నన్ను బెదిరిస్తున్నాడు’ అని ఓ మహిళ టీడీపీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసింది. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహించారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, బీదా రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఆచంట సునీత వినతులు స్వీకరించారు. కడప చిన్నచౌక్‌లో ఒక వ్యక్తి చిట్టీలు కట్టించుకుని, రూ.20 కోట్లుతో పరారయ్యాడని హనుమంతరావు, హరిప్రసాద్‌ తదితరులు టీడీపీ నేతలకు ఏకరవు పెట్టారు. తాము టీడీపీలో చేరడంతో వైసీపీ వ్యక్తి తప్పుడు కేసు పెట్టి, టాంజానియా వెళ్లిన తన కొడుకును ఇబ్బంది పెడుతున్నారని సత్యసాయి జిల్లా లింగాలవారిపల్లికి చెందిన సోమశేఖర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. బాపట్ల జిల్లాలో ఆలేరు కాలువ తవ్వకంలో 119 ఎకరాల పొలం పోతే, నష్టపరిహారం అడిగితే.. అధికారులు దురుసుగా మాట్లాడుతున్నారని, తమకు ఆత్మహత్యే గతి అంటే.. ఇష్టం వచ్చింది చేసుకోమంటున్నారని టీడీపీ నేతలకు ఫిర్యాదు చేశారు. 2018లో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చు పెడితే ఇప్పటికీ ఇవ్వలేదని పెద్దారవీడుకు చెందిన తిరుపతయ్య యాదవ్‌ వాపోయారు. కావలి మండలం తుమ్మలపెంటలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ పద్మావతి వైసీపీ నేతలకు అనుకూలంగా ఉండి, పాఠశాలలో విద్యార్థులను ఇబ్బంది పెడుతోందని పలువురు ఫిర్యాదు చేశారు. రానున్న డీఎస్సీ నోటిఫికేషన్‌లో వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచాలని పలువురు నిరుద్యోగులు కోరారు. మాజీ మంత్రి జోగి రమేష్‌ అండదండలతో కృత్తివెన్ను మండలం శీతనపల్లి వద్ద ఉన్న 50 ఎకరాల మంచినీటి చెరువులోని చేపలు మొత్తం దోచుకెళ్లారని, లక్ష్మీపురం పల్లెపాలెం గ్రామానికి చెందిన పెదసింగు దావీదు టీడీపీ నేతలకు ఫిర్యాదు చేశారు.

టీడీపీ పాలనలోనే

అంగన్వాడీలకు మేలు ఆచంట

అమరావతి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): టీడీపీ పాలనలోనే అంగన్వాడీలకు మేలు జరుగుతుందని, వారి సమస్యలు పరిష్కారమౌతాయని అంగన్వాడీ, డ్వాక్రా సంఘాల కన్వీనర్‌ ఆచంట సునీత అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో కలసి ఆమె మీడియాతో మాట్లాడారు. అవసరం ఉన్నప్పుడు అంగన్వాడీలను రెచ్చగొట్టి రోడ్లపైకి తెచ్చే సీఐటీయూ నేతలు వరద బాధితులకు సాయం చేయమంటే బీద పలుకులు పలుకుతున్నారని మండిపడ్డారు. సీఐటీయూ నేతలకు అంగన్వాడీలంటే ఏటీఎంలా అని ప్రశ్నించారు.

Updated Date - Sep 25 , 2024 | 07:22 AM