Share News

ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

ABN , Publish Date - Aug 28 , 2024 | 12:03 AM

ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హిస్టరీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి
చరిత్రశాఖ విభాగాధిపతి డాక్టర్‌ ప్రకాశం, పొలిటికల్‌ సైన్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం తదితరులు

ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

భారతీనగర్‌, ఆగస్టు 27: ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హిస్టరీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు టంగుటూరి ప్రకాశం పంతులు చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. చరిత్రశాఖ విభాగాధిపతి డాక్టర్‌ ప్రకాశం, పొలిటికల్‌ సైన్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం, ప్రభుత్వ పాలనాశాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ పద్మనాభం, అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ జాన్‌ సుకుమార్‌, అధ్యాపకులు డాక్టర్‌ కొల్లేటి రమేష్‌, ఉమా తరంగణి, డాక్టర్‌ మల్లేశ్వరమ్మ, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2024 | 12:03 AM