AP Highcourt: సజ్జల భార్గవ పిటిషన్.. మధ్యంతర ఉత్తర్వులు జారీ
ABN , Publish Date - Dec 16 , 2024 | 01:45 PM
Andhrapradesh: వైసీపీ నేత సజ్జల భార్గవ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన పై నమోదైన తొమ్మిది కేసులు కొట్టివేయాలని భార్గవ్ రెడ్డి.. హైకోర్ట్‌ను ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది.
అమరావతి, డిసెంబర్ 16: సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ రెడ్డి (YSRCP Sajjala Bhargava Reddy) పిటిషన్‌పై హైకోర్టులో (AP highcourt) విచారణ జరిగింది. తన పై నమోదైన తొమ్మిది కేసులు కొట్టివేయాలని భార్గవ్ రెడ్డి.. హైకోర్ట్‌ను ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది. అలాగే సజ్జల భార్గవకు రెండు వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
AP News: తండ్రి ఉద్యోగం కోసం కూతురి మర్డర్ ప్లాన్.. తెలిస్తే షాకవ్వాల్సిందే
సజ్జల భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించి కంటెంట్ తయారు చేసి ఇవ్వడమే కాకుండా.. రాష్ట్రంలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అందరికీ కూడా కంటెంట్‌ను పంపి.. వాటిని సోషల్ మీడియాలో పెట్టి ప్రతిపక్ష నేతలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. దీంతో పాటు పులివెందులలో పోలీసులు అరెస్ట్ చేసిన వర్రా రవీందర్ రెడ్డి కూడా తనకు ఈ కంటెంట్ అంతా కూడా తాడేపల్లి నుంచి వస్తుందని.. సజ్జల భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా ఉన్నారని పోలీసుల విచారణలో వర్రా తెలిపారు. ఈ నేపథ్యంలో వర్రా ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కూడా సోషల్ మీడియా కంటెంట్‌ను సజ్జల ఇవ్వడం వల్లే తమపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో సజ్జలపై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9 కేసులు నమోదు అయ్యాయి.
దీంతో ఈ కేసులన్నింటినీ కొట్టివేయాలని సజ్జల భార్గవ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే సజ్జల భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. అధికారం కోల్పోయే వరకు కూడా వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా సజ్జల భార్గవ రెడ్డి వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది కేసులు నమోదు అవగా.. మరికొన్ని కేసులను కూడా సజ్జలపై నమోదు చేసే అవకాశం ఉంది. దీంతో ఈ కేసులను కొట్టివేయాలని సజ్జల హైకోర్టును ఆశ్రయించగా.. కేసు విచారణను రెండు వారాలకు ధర్మాసనం వాయిదా వేసింది. ఈ రెండు వారాల్లోపు పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అప్పటి వరకు భార్గవపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ అసెంబ్లీ.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
Read Latest AP News And Telugu News