ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి
ABN , Publish Date - Nov 19 , 2024 | 01:47 AM
తమను ప్రభుత్వ ఉద్యో గులుగా గుర్తించాలని 108 కాంట్రాక్టు ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద నిరాహార దీక్ష చేశారు.
మచిలీపట్నం టౌన్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): తమను ప్రభుత్వ ఉద్యో గులుగా గుర్తించాలని 108 కాంట్రాక్టు ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద నిరాహార దీక్ష చేశారు. ‘108 అంబులెన్స్ వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలి. రోజుకు మూడు షిఫ్టులలో ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల నియామకాల్లో వెయిటేజీ మార్కులు కల్పించాలి. వైద్య ఆరోగ్యశాఖలో ఈఎన్టీ పోస్టుల నియామకాల్లో 108లో పనిచేస్తున్న వారిని నియమించాలి. వేతనాలు పెంచాలి. ప్రమాదవశాత్తూ కానీ, సహజ మరణం పొందిన ఉద్యోగి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలి. 108 వాహనాలకు శాశ్వత భవనాలు నిర్మించాలి. ఉద్యోగులకు బకాయిలను పూర్తిగా చెల్లించాలి.’ అని ఏపీ 108 సర్వీసుల కాంట్రాక్టు ఉద్యోగుల సం ఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రవికుమార్ డిమాండ్ చేశారు. సంఘ గౌరవాధ్యక్షుడు టి.చంద్రపాల్, జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీహరి, కోశాధికారి కె.శ్యామ్‌కిరణ్ పాల్గొన్నారు.