Share News

బస్టాండ్‌లో.. సమస్యల తిష్ట!

ABN , Publish Date - Nov 13 , 2024 | 01:09 AM

టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీరామారావు మానస పుత్రికగా.. ఎంతో ముందుచూపుతో ఆయన స్వంత మండల కేంద్రం పామర్రులో ప్రయాణికుల సౌకర్యార్ధం నిర్మించిన బస్టాండ్‌ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రయాణికులకు ఎంతగానో సేవలందించింది. కాలక్రమంలో బస్టాండ్‌ను పట్టించుకునే నాథుడు లేక ఎంతో చరిత్రగల పామర్రు బస్టాండ్‌ రూపు కోల్పోయి.. పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది.

బస్టాండ్‌లో.. సమస్యల తిష్ట!
అసంపూర్తిగా బస్డాండ్‌ ఆధునీకరణ పనులు

  • బస్‌స్టేషన్‌లో కానరాని వసతులు

  • ప్రయాణికులకు తప్పని అవస్థలు

  • ఆధునికీకరణ పేరుతో వైసీపీ పాలకుల నిర్లక్ష్యం

  • కూటమి ప్రభుత్వంలో పూర్వ వైభవం తెస్తాం : వర్ల రాజా

టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీరామారావు మానస పుత్రికగా.. ఎంతో ముందుచూపుతో ఆయన స్వంత మండల కేంద్రం పామర్రులో ప్రయాణికుల సౌకర్యార్ధం నిర్మించిన బస్టాండ్‌ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రయాణికులకు ఎంతగానో సేవలందించింది. కాలక్రమంలో బస్టాండ్‌ను పట్టించుకునే నాథుడు లేక ఎంతో చరిత్రగల పామర్రు బస్టాండ్‌ రూపు కోల్పోయి.. పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది.

(పామర్రు, ఆంధ్రజ్యోతి)

రెండు జాతీయ రహదారుల మధ్య జంక్షన్‌లో నాడు మహానీయుడు ఎన్టీఆర్‌ బస్‌ స్టేషన్‌కు 1984లో శంకుస్థాపన చేసి 1986 మార్చి 15న ప్రజలకు అంకితమిచ్చారు. నాటి నుంచి ప్రయాణికులతో నిత్యం ఎంతో రద్దీగా ఉండే బస్‌స్టేషన్‌.. ప్రస్తుతం కనీస వసతుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. ప్రయాణికులకు కనీసం మరుగుదొడ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆధునికీకరణ పేరుతో సుమారు 20 మరుగుదొడ్లను అధికారులు కూల్చివేసి వాటి స్థానంలో తాత్కాలికంగా రేకులతో నిర్మించినా ఇప్పటికీ ప్రయాణికులకు అందుబాటులోకి రాలేదు. తాగునీటి సౌకర్యం కూడా లేదు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం స్పందించి దివంగత ముఖ్యమంత్రి స్వంత మండల కేంద్రంలోని బస్‌స్టేషన్‌లో ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించి పూర్వవైభవం తీసుకురావాలని కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆధునీకరణ పేరుతో కోట్లాది రూపాయల దుర్వినియోగంపై విచారణ జరపాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

పూర్వ వైభవం తెస్తాం

ఎమ్మెల్యే వర్లకుమార్‌ రాజా

పామర్రు బస్‌స్టేషన్‌కు పూర్వవైభవం తెచ్చేలా ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణతో ఇప్పటికే చర్చించాం. ఈ విషయంపై అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతా. ఆధుకినీకరణపేరుతో గత వైసీపీ పాలకుల అవినీతిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

Updated Date - Nov 13 , 2024 | 01:09 AM