Share News

AP News: ఎంఎస్ఎంఈ ఇండ్రస్ట్రియల్ పాలసీపై మండలిలో ఆసక్తికర చర్చ

ABN , Publish Date - Nov 15 , 2024 | 04:12 PM

Andhrapradesh: ఏపీఐఐసీ భూములు, ప్రభుత్వ భూముల్లో పార్క్‌లు అభివృద్ధి చేస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు స్థలాల్లో పార్క్‌లు అభివృద్ధి చేసిన చోట పరిశ్రమలు పెట్టుకునేందుకు ముందుకొస్తే వారికి కూడా పది శాతం అదనపు రాయితీ ఇస్తున్నామని మంత్రి తెలిపారు.

AP News: ఎంఎస్ఎంఈ ఇండ్రస్ట్రియల్ పాలసీపై మండలిలో ఆసక్తికర చర్చ
Interesting discussion in the Council on MSME Industrial Policy

అమరావతి, నవంబర్ 15: ఎంఎస్ఎంఈ ఇండ్రస్ట్రియల్ పాలసీపై శాసన మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. ప్రైవేటు వ్యక్తులు పార్క్ అభివృద్ధి చేసుకుంటే అందులో ఎవరైనా ఎస్సీ ఎస్టీ, బీసీ లు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వారికి పదిశాతం అదనపు రాయితీ ఇస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. అయితే పార్క్‌లో స్థలాల కేటాయింపులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతున్నారా లేదా అని మండలి ఛైర్మన్ ప్రశ్నించారు. ఇదే అంశంపై స్పష్టత ఇవ్వాలని వైసీపీ సభ్యులు రవిబాబు, రవీంద్ర బాబు అన్నారు.

CM Chandrababu: అనుకున్న దానికన్నా ఎక్కువే విధ్వంసం


ఏపీఐఐసీ భూములు, ప్రభుత్వ భూముల్లో పార్క్‌లు అభివృద్ధి చేస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు స్థలాల్లో పార్క్‌లు అభివృద్ధి చేసిన చోట పరిశ్రమలు పెట్టుకునేందుకు ముందుకొస్తే వారికి కూడా పది శాతం అదనపు రాయితీ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. పాలసీ విధివిధానాలుపై రాతపూర్వకంగా ఇవ్వాలని వైసీపీ సభ్యుడు రవిబాబు పట్టుపట్టారు. మంత్రి స్టేట్‌మెంట్ ఇస్తుంటే దానిపై వివరణ అడగటం, చర్చకు తెర తీయడం సాంప్రదాయం కాదని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.


కాగా.. అంతకుముందు మంత్రి స‌త్యకుమార్ తీరును నిర‌సిస్తూ శాస‌న మండ‌లి నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశంపై మంత్రి సత్య కుమార్ సమాధానానికి వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంలో అన్ని మెడికల్ కాలేజ్‌ల నిర్మాణానికి ఒకే విధమైన నిధులు ఖర్చు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. పులివెందుల కాలేజ్ నిర్మాణానికి రూ.500 కోట్లకు గారూ. రూ. 290 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.

Kollu Ravindra: ఊగిపోయిన దువ్వాడ.. మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ కౌంటర్


అదే సమయంలో మార్కాపురం కాలేజ్‌ కోసం రూ. 475 కోట్లకు గానూ కేవలం రూ. 47 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వెల్లడించారు. పులివెందులపై ఉన్న శ్రద్ధ రాయలసీమలోని ఇతర కాలేజ్‌లపై ఎందుకు లేదో వైసీపీ సభ్యులు చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. పులివెందులలో ఆడపిల్లల హాస్టల్స్ కట్టకుండా వారు చెట్ల కింద కూర్చొని చదువుకోవాలా అని ఆయన‌ నిలదీశారు. ప్రతిరోజు మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి సత్యకుమార్ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

Hyderabad: సైబర్‌ నేరగాళ్లు కాజేసిన డబ్బు రికవరీ

Kartik Purnima 2024: కార్తీక పౌర్ణమికి ఈ వస్తువులు దానం చేయండి.. లక్ష్మీ దేవి తప్పకుండా..

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 15 , 2024 | 04:12 PM