Share News

AP Assembly: రఘురామ వేసిన ప్రశ్నకు.. ఎమ్మెల్యే నవ్వుతూ సమాధానం.. ఇంతకీ ఏమడిగారంటే

ABN , Publish Date - Nov 19 , 2024 | 11:07 AM

Andhrapradesh: చేనేత కార్మికుల సమస్యలను నెల్లిమర్ల ఎమ్మెల్యే వివరించిన తీరుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు సంతోషం వ్యక్తం చేశారు. చాలా చక్కగా మాట్లాడారని కొనియాడారు. అంతేకాకుండా సదరు ఎమ్మెల్యే కట్టిన చీరపై డిప్యూటీ స్పీకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ రఘురామ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.

AP Assembly: రఘురామ వేసిన ప్రశ్నకు.. ఎమ్మెల్యే నవ్వుతూ సమాధానం.. ఇంతకీ ఏమడిగారంటే
ap assembly

అమరావతి, నవంబర్ 19: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో అనేక ఆసక్తికర సంఘటనలు జరుగుతుండటం కామన్. ఎమ్మెల్యేలు, మంత్రుల చమత్కారాలు... అలాగే ప్రతిపక్ష నేతలతో అధికార పక్షం నేతలు నడుచుకునే విధానం ఇలా ఎన్నో ఆసక్తికర దృశ్యాలను అసెంబ్లీ సమావేశాల సమయంలో చూస్తుంటాం. కొన్ని సంఘటనకు నవ్వు తెప్పించేలా ఉంటే.. మరికొన్ని తీవ్ర చర్చకు దారి తీస్తాయి. తాజాగా ఈరోజు ఏపీ అసెంబ్లీలో జరిగిన ఓ ఘటన సభ్యులు మనసారా నవ్వకునేలా చేసింది.

ఓ మై గాడ్.. బీచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ


చేనేత కార్మికుల సమస్యలను నెల్లిమర్ల ఎమ్మెల్యే వివరించిన తీరుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు (Deputy SPeaker Raghurama krishna raju)సంతోషం వ్యక్తం చేశారు. చాలా చక్కగా మాట్లాడారని కొనియాడారు. అంతేకాకుండా సదరు ఎమ్మెల్యే కట్టిన చీరపై డిప్యూటీ స్పీకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ రఘురామ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.


ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడవ రోజుకు చేరుకున్నాయి. సభ మొదలవగానే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. అలాగే చేనేత సమస్యలపైన జనసేనకు చెందిన నెల్లిమర్ల లోకం మాధవి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. క్వశ్చన్ అవర్‌లో చేనేత కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే లోకం మాధవి ప్రశ్న అడిగారు. చేనేత కార్మికుల సమస్యలను పూర్తిగా వివరించారు.

రోహిత్‌తో గేమ్స్ ఆడుతున్న బీసీసీఐ


చేసేత సమస్యలను ఎమ్మెల్యే వివరించిన తీరును డిప్యూటీ స్పీకర్ కొనియాడారు. చేనేత సమస్యలను చక్కగా వివరించారు అని తెలిపారు. ఆపై ఎమ్మెల్యే ధరించిన చీరపైన డిప్యూటీ స్పీకర్ ప్రశ్న వేశారు. నెలలో ఒక్క రోజు ప్రభుత్వ ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించేందుకు ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని ఎమ్మెల్యే ప్రశ్నించగా... ‘‘ ఇంతకీ మీరు ధరించింది చేనేత చీర లేదా వేరే చీరనా’’ అని ఎమ్మెల్యేను రఘురామ ప్రశ్నించారు. దీంతో తాను చేనేత చీర ధరించానని ఎమ్మెల్యే మాధవి నవ్వుతూ సమాధానం ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

పవన్ కల్యాణ్‌కు ఊరట

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నీటిపారుదల రంగంపై మంత్రి నిమ్మల కామెంట్స్

Real Latest AP News And Telugu News

Updated Date - Nov 19 , 2024 | 11:11 AM