Share News

రంగంలోకి.. ఎన్నికల పరిశీలకులు

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:49 AM

ఎన్టీఆర్‌ జిల్లాలో పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి దిల్లీరావు, ఇతర రిటర్నింగ్‌ అధికారుల నుంచి విషయాలను తెలుసుకుంటున్నా

రంగంలోకి.. ఎన్నికల పరిశీలకులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఎన్టీఆర్‌ జిల్లాలో పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి దిల్లీరావు, ఇతర రిటర్నింగ్‌ అధికారుల నుంచి విషయాలను తెలుసుకుంటున్నారు. గతానికి భిన్నంగా పరిశీలకులు ప్రజాబాహుళ్యంలోకి రావాలని నిర్ణయించారు. ఎన్నికల ఏర్పాట్లు, అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి రాజకీయ నాయకుల నుంచి సాధారణ ప్రజల వరకు తమ దృష్టికి ఎలాంటి అంశాలనైనా తీసుకు వచ్చేందుకు వీలుగా వన్‌ టూ వన్‌ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్‌ జిల్లా ఎన్నికల అధికారి దిల్లీరావు శుక్రవారం మీడియాకు తెలిపారు. జిల్లా ఎన్నికల పరిశీలకులకు విజ్ఞాపనలు, ఫిర్యాదులు అందించవచ్చని చెప్పారు. తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్‌, విజయవాడ తూర్పు నియోజకవర్గాలకు మంజూ రాంపాల్‌ ఎన్నికల పరిశీలకులుగా నియమితులయ్యారు. మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నరీందర్‌ సింగ్‌ బాలిలు సాధారణ పరిశీలకులుగా వచ్చారు. సాధారణ పరిశీలకులు పోలింగ్‌ తేదీ వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు మునిసిపల్‌ గెస్ట్‌ హౌస్‌ - నందమూరి రోడ్డు, బృందావన్‌ కాలనీ - లబ్బీపేటలో అందుబాటులో ఉంటారు. రాజకీయ పార్టీల ప్రతినిథులు, అభ్యర్థులు, ప్రజలు ఎన్నికల ఉల్లంఘనలకు సబంధించి ఫిర్యాదులు, విజ్ఞాపనలు ఇవ్వవచ్చు. సాధారణ పరిశీలకురాలు మంజూ రాంపాల్‌ను 8121526777 నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చు. మరో సాధారణ పరిశీలకులు నరీందర్‌ సింగ్‌ బాలిని 9154883009 నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చు. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పోలీసు ఆబ్జర్వర్‌ ప్రీతీందర్‌ సింగ్‌ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు పోలీసు గెస్ట్‌హౌ్‌సలో అందుబాటులో ఉంటారు. ప్రీతీందర్‌సింగ్‌ను 9154883014 నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమితులైన వారు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. విజయవాడ పార్లమెంట్‌ ఎన్నికల వ్యయ పరిశీలకులు వీ జస్టిన్‌, తిరువూరు - విజయవాడ పశ్చిమ - విజయవాడ సెంట్రల్‌ - మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు సౌరభ్‌శర్మ, విజయవాడ తూర్పు - నందిగామ - జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు మదన్‌కుమార్‌ మధ్యాహ్నం 4 గంటల నుంచి 5 గంటల వరకు పంచాయతీరాజ్‌ గెస్ట్‌హౌ్‌సలో అందుబాటులో ఉంటారు. జస్టిన్‌ను 8121490777, సౌరభ్‌ శర్మను 8121405777, మదన్‌కుమార్‌ను 9154883050 నెంబర్లలో సంప్రదించవచ్చు.

Updated Date - Apr 27 , 2024 | 12:49 AM