ఫీజు చెల్లించలేదని హాల్‌టికెట్లు ఇవ్వకపోవడం సరికాదు
ABN , Publish Date - Dec 03 , 2024 | 01:12 AM
కళాశాల ఫీజు చెల్లించలేదని వీకేఆర్ అండ్ వీ ఎన్‌బీ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం సరికాదని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి సమరం అన్నారు.
గుడివాడ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): కళాశాల ఫీజు చెల్లించలేదని వీకేఆర్ అండ్ వీ ఎన్‌బీ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం సరికాదని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి సమరం అన్నారు. కళాశాల బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థులు 35 మందికి ఫీజు చెల్లించలేదని హాల్‌టికెట్ ఇవ్వడం లేదని తెలుసుకుని ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసాదరావుతో ఆయన మాట్లాడారు. సాయంత్రంలోపు హాల్‌టికెట్లు ఇస్తామని చెప్పారని విలేకరులకు తెలిపారు. విడతల వారీగా ఫీజు మొత్తాన్ని చెల్లిస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టంగా చెప్పినా, విద్యార్థులను ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని మంత్రి లోకేశ్‌ను సమరం కోరారు. ఎస్‌ఎ్‌ఫఐ మండలాధ్యక్షుడు నాగేంద్రకుమార్ పాల్గొన్నారు.