Share News

టీసీఎస్‌లో పీబీ సిద్ధార్థ విద్యార్థులకు ఉద్యోగాలు

ABN , Publish Date - Nov 22 , 2024 | 12:20 AM

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టీసీఎస్‌లో 52 మంది విద్యార్థులు ఉపాధి అవకాశాలు పొందారని పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌ తెలిపారు.

టీసీఎస్‌లో పీబీ సిద్ధార్థ విద్యార్థులకు ఉద్యోగాలు
విద్యార్థులతో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌, డైరెక్టర్‌ వేమూరి బాబూరావు తదితరులు

టీసీఎస్‌లో పీబీ సిద్ధార్థ విద్యార్థులకు ఉద్యోగాలు

మొగల్రాజపురం, నవంబరు 21( ఆంధ్ర జ్యోతి): ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టీసీఎస్‌లో 52 మంది విద్యార్థులు ఉపాధి అవకాశాలు పొందారని పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌ తెలిపారు. గురువారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌ ద్వారా దేశవ్యాప్తంగా నిర్వహించిన టీసీఎస్‌ నేషనల్‌ క్వాలిఫైయర్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన ఏన్టీయార్‌, కృష్ణా, గుంటూరు, పల్నాడు, జిల్లాల విద్యార్థులకు తమ ప్రాంగణంలో ఇంటర్య్యూలు నిర్వహించారని తెలిపారు. ఇంటర్యూల ఫలితాలు గురువారం విడుదల చేయగా అత్యధికంగా తమ విద్యార్థులు 52 మంది ఉపాధి అవకాశాలు పొందారని తెలిపారు. డైరెక్టర్‌ వేమూరి బాబూరావు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనతో పాటు సమస్యా పరిష్కారం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలలో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ సందర్భంగా 52 మంది విద్యార్థులకు సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ చదలవాడ నాగేశ్వరరావు, పాలడుగు లక్ష్మణరావు, కన్వీనర్‌ సూరెడ్డి వెంకటేశ్వరరావు, డీన్‌ ప్రొఫెసర్‌ రాజేష్‌ జంపాల, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.

Updated Date - Nov 22 , 2024 | 12:20 AM