Share News

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా కోట వీరబాబు

ABN , Publish Date - Dec 22 , 2024 | 01:00 AM

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా కోట వీరబాబు(టీడీపీ), వైస్‌ చైర్మన్‌గా ఆళ్ల గోపాలకృష్ణ(టీడీపీ) ఎన్నికయ్యారు.

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా కోట వీరబాబు
ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ కోట వీరబాబు, వైస్‌ చైర్మన్‌ ఆళ్ల గోపాలకృష్ణకు నియామక పత్రం అందిస్తున్న అధికారులు, పక్కన టీడీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం

వైస్‌ చైర్మన్‌గా ఆళ్ల గోపాలకృష్ణ

నందిగామ, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా కోట వీరబాబు(టీడీపీ), వైస్‌ చైర్మన్‌గా ఆళ్ల గోపాలకృష్ణ(టీడీపీ) ఎన్నికయ్యారు. శనివారం విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో అఽధికారులు ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు నిర్వహించారు. 17 మంది డిస్ర్టిబ్యూటరీ కమిటీల చైర్మన్లు ప్రాజెక్టు కమిటీని ఎన్నుకున్నారు. టీడీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌, ప్రభుత్వ విప్‌ తంగిరాల సౌమ్య, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్‌, శ్రీరాం రాజగోపాల్‌, వర్ల కుమార్‌రాజా, టీడీ పీ నాయకుడు గన్నే వెంకటనారాయణ(అన్న), బొమ్మసాని సుబ్బారావు, జం పాల సీతారామయ్య అభినందించారు.

ఆయకట్టు చివరి భూములకూ నీరందిస్తా: కోట వీరబాబు

ఆయకట్టు చివరి భూములకూ నీరందించడమే లక్ష్యంగా పని చేస్తానని ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ కోట వీరబాబు తెలిపారు. తనకు పదవి రావడానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్‌, సత్యకుమార్‌కకృతజ్ఞతలు తెలిపారు. తనకు అండగా నిలిచిన జిల్లా ఎమ్మెల్యేలకు, ఎంపీకి రుణపడి ఉంటానన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 01:00 AM