AP News: విజయవాడలో కృష్ణవేణి సంగీత నిరాజనం..
ABN , Publish Date - Dec 06 , 2024 | 12:58 PM
Andhrapradesh: రాష్ట్రంలో ఉన్న సంగీత రంగంలోని కళాకారులను ఒకసారి మననం చేసుకోవడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణమని మంత్రి దుర్గేష్ తెలిపారు. సంగీత నీరాజనం అంటే సంగీతానికి పునరంకితం అవ్వడమన్నారు. సంగీత నీరాజనం కార్యక్రమాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రంలోనే కాకుండా అమ్మవారి ఆలయం, దుర్గాఘాట్‌లోనూ నిర్వహిస్తున్నామన్నారు.
విజయవాడ, డిసెంబర్ 6: నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh), కేంద్రమంత్రి, నటుడు సురేష్ గోపి (Union Minister Suresh Gopi) పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సామజవరగమన సంగీతాన్ని కేంద్రమంత్రి సురేష్ గోపి పాడి వినిపించారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న సంగీత రంగంలోని కళాకారులను ఒకసారి మననం చేసుకోవడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణమని తెలిపారు. సంగీత నీరాజనం అంటే సంగీతానికి పునరంకితం అవ్వడమన్నారు.
భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
సంగీత నీరాజనం కార్యక్రమాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రంలోనే కాకుండా అమ్మవారి ఆలయం, దుర్గాఘాట్‌లోనూ నిర్వహిస్తున్నామన్నారు. పద్య నాటకం మనకు మాత్రమే సొంతమైన కల అని పేర్కొన్నారు. రాజమండ్రిలో దేవీ నవరాత్రుల సమయంలో పద్య నాటకాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారన్నారు. తోలుబొమ్మలాట, జానపద కళారూపాలు ఎన్నో రాష్ట్రంలో ఉన్నయని.. వాటన్నిటినీ బతికించుకోవాలని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలోనే కళాకారులకు గుర్తింపు సాధ్యమన్నారు. సురేష్ గోపి అద్భుతమైన నటుడని.. అంతేకాకుండా ఆయన కేంద్ర మంత్రి కావడం మన అదృష్టమన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు రాష్ట్రంలో ఉండబట్టే కళలు ఇంకా అంతరించిపోకుండా ఉన్నాయన్నారు. టూరిజనుని కూడా సమగ్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
తెలుగు సినిమా డైలాగ్‌లు చెప్పిన కేంద్రమంత్రి
కర్ణాటక సంగీతాన్ని కృష్ణవేణి సంగీత నీరాజనం ద్వారా ప్రజలకు తెలియపరచడం చాలా సంతోషంగా ఉందని కేంద్రమంత్రి, నటుడు సురేష్ గోపి అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అభినందనలు తెలియజేశారు. ‘‘విజయవాడకు రావడం నా సొంత ఇంటికి వచ్చినట్టు ఉంది. నన్ను ఒక కళాకారుడుగా, నటుడుగా ఆంధ్ర ప్రజలు ఎప్పుడు స్వాగతిస్తున్నారు. కర్ణాటక సంగీతాన్ని విజయవాడ నగర వాసులకు పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. అన్నమచార్య, త్యాగరాజు, రామదాసులాంటి వ్యక్తులు ఈ గడ్డమీద పుట్టారు. అహోబిలం, కేరళ, మైసూర్ కూడా సంగీత నీరాజనం లాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జానపద కళలకు, ఇండియన్ కల్చర్‌కు, సంస్కృతి సాంప్రదాయాలు పెద్దపీఠం వేశారు’’ అని తెలిపారు.
‘‘సంగీత ప్రియులకు ఇది ఒక శుభ పరిణామం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలి. రాబోయే జనరేషన్స్‌కు కర్ణాటక సంగీతం గురించి నేర్చుకోవడం చాలా అవసరం. మైసూర్‌లో జరిగే సుగంధ సంగీత ఫెస్టివల్ కూడా ఎంతో వైభపేతంగా జరిగింది. ఈ మూడు రోజులు పాటు జరిగే కర్ణాటక సంగీతంలో పాడేవారికి, శ్రోతలకి అందరికీ మన హిస్టరీ వేల్యూస్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని కేంద్రమంత్రి వెల్లడించారు. కృష్ణంరాజుతో కలిసి అంతిమ తీర్పులో నటించాను అంటూ ఈ సందర్భంగా చెప్పిన కేంద్రమంత్రి.. తెలుగులో సినిమా డైలాగులు చెప్పారు. తెలుగులో సాగర సంగమం, శంకరాభరణం ఈ రెండు చిత్రాలు కర్ణాటక సంగీత స్థాయిని పెంచాయన్నారు. సోమయాజులు పాడిన పాటలు ఎంతో మనసుకు హద్దుకొని ఉన్నాయి అంటూ బ్రోచేవారెవరు రా పాటను పాడి వినిపించారు కేంద్రమంత్రి సురేష్ గోపి. కాగా.. మూడు రోజుల పాటు కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం సాగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి సురేష్ గోపి, రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి కందుల దుర్గేష్‌తో పాటు.. ఏపీ సృజనాత్మక, సంస్కృతి సమితి ఛైర్ పర్సన్ తేజస్విని పొడపాటి, ఏపీ టూరిజం డవలప్ మెంట్ కార్పొరేషన్ ఎం. డి అమ్రపాల్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
భవిష్యత్తులో ఆ దేశం అంతరించిపోతుంది.. ఎలాన్
Read Latest AP News And Telugu News