Share News

Vijayawada Durgamma: దుర్గమ్మ లడ్డూ ప్రసాదం తయారీలోనూ లోపాలు.. వెలుగులోకి నిజాలు

ABN , Publish Date - Sep 26 , 2024 | 09:32 AM

వైసీపీ ప్రభుత్వ హయంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన కల్తీ నెయ్యి వాడకంపై హిందువులు, ధార్మిక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్న వేళ.. విజయవాడలోని దుర్గమ్మ లడ్డూ తయారీలో కూడా లోపాలు ఉన్నట్టు బయటపడ్డాయి.

Vijayawada Durgamma: దుర్గమ్మ లడ్డూ ప్రసాదం తయారీలోనూ లోపాలు.. వెలుగులోకి నిజాలు

విజయవాడ: వైసీపీ ప్రభుత్వ హయంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిసిన కల్తీ నెయ్యి వాడకంపై హిందువులు, ధార్మిక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్న వేళ.. విజయవాడలోని దుర్గమ్మ లడ్డూ తయారీలో కూడా లోపాలు ఉన్నట్టు బయటపడ్డాయి. దుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో వినియోగించే జీడిపప్పు ప్యాకెట్లపై లేబుల్స్ కనిపించడం లేదని తనిఖీల్లో వెల్లడైంది. దుర్గమ్మ లడ్డూ ప్రసాదం నాణ్యతపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లోపాలు బయటపడ్డాయి.


కాంట్రాక్టర్లు నాసిరకం సరుకు సరఫరా చేస్తున్నట్టు తేలింది. జీడిపప్పు, ఇతర ప్యాకెట్లపై లేబుల్స్ కనిపించలేదు. దీంతో నాణ్యత లేకపోవడంతో 1,100 కిలోల కిస్మిస్, 700 కేజీల జీడిపప్పును అధికారులు తిప్పి పంపించారు. జీడిపప్పు, కిస్మిస్ నాణ్యతకు తిలోదకాలు అద్దినట్టు స్పష్టమవుతోంది.


లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యి, బెల్లం, శెనగపప్పు నమూనాలను కూడా పరీక్షించేందుకు హైదరాబాద్‌కు పంపినట్టు తెలుస్తోంది. ల్యాబ్‌ రిపోర్ట్స్‌ రావడానికి14 రోజుల సమయం పడుతుందని సమాచారం. అమ్మవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఎక్కువగా జీడిపప్పు, కిస్‌మిస్‌లను వినియోగిస్తుంటారు. అయితే లడ్డూ నాణ్యతపై భక్తులు సందేహాలు వ్యక్తం చేస్తుండడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు.

Updated Date - Sep 26 , 2024 | 11:36 AM