సమర్ధ్ ప్రాజెక్టు ప్రారంభం
ABN , Publish Date - Nov 13 , 2024 | 01:03 AM
కొరియా సహకారంతో సుస్థిర సంస్థల పురోగతికి విజయవాడలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ద్వారామంజూరైన సమర్ధ్ ప్రాజెక్టును దక్షిణ కొరియా రాయబారి లింగ్‌సాంగ్ వూ మంగళవారం ప్రారంభించారు.
వన్‌టౌన్/ఆటోనగర్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : కొరియా సహకారంతో సుస్థిర సంస్థల పురోగతికి విజయవాడలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ద్వారామంజూరైన సమర్ధ్ ప్రాజెక్టును దక్షిణ కొరియా రాయబారి లింగ్‌సాంగ్ వూ మంగళవారం ప్రారంభించారు. ఆయన నేతృత్వంలోని ఆరుగురు కొరియన్ ప్రతినిధుల బృందం నగరంలోని అలీప్ పారిశ్రామిక వాడను సందర్శించి అనంతరం సీఎం చంద్రబాబు నాయుడును కలిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని సంస్థలు కొరియా ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ ద్వారా నిధులు సమకూర్చటానికి సిద్ధమయ్యాయి. భారత, కొరియా ద్వైపాక్షిక సహకారం గురించి డైరెక్టర్ ఊచాన్ చాంగ్ మాట్లాడుతూ, ఇరు దేశాల సుస్ధిర అభివృద్ధికి ఇది ఒక మైలురాయి అన్నారు. కోస్‌మే డైరెక్టర్ జె క్యోంగ్ లీ మాట్లాడుతూ, పరస్పర సహకారంతో సుస్ధిర సంస్థల పురోగతికి తోడ్పడుతూ రెండు దేశాలను ప్రపంచ పటంలో ఉన్నత స్ధానంలో నిలుపవచ్చన్నారు. ఒడిసా రాష్ట్ర ప్రతినిధులు ప్రభాకర్‌రావు, అన్వేషి రౌత్, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు నందినీ సవారియా, వైదేహి, చంద్రిమా చటర్జీ, డాక్టర్ పిడికిటి జ్యోతిరావు, కొరియా నిపుణులు జెడాంగ్ కాంగ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రామగిరి బిజినెస్ సలహాదారు సాంగ్ గీ హాంగ్, డాక్టర్ బ్యాంకింగ్ డే చోయ్, అలీప్ సంస్ధల అధ్యక్షురాలు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి కె.రమాదేవి, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నిర్వహించిన వర్క్‌షా్‌పలో మహిళల సాధికారిత కోసం చేస్తున్న విభిన్న కార్యక్రమాల గురించి కొరియన్ ప్రతినిధుల బృందానికి రమాదేవి వివరించారు. భారత సుస్థిర సంస్థల ప్రోత్సాహక సంస్థ ముఖ్య సాంకేతిక సలహాదారు సుదీప్త భద్ర మాట్లాడుతూ, కొరియా సహకారంతో సుస్ధిర సంస్థల పురోగతికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అలీప్ సంస్థ ద్వారా శిక్షణ పొందిన మహిళలు తయారుచేసిన వస్తువులను ప్రదర్శించారు.