Share News

బీసీల సత్తా చాటుదాం.. పెత్తందారి జగన్‌ను తరిమికొడదాం

ABN , Publish Date - Feb 08 , 2024 | 12:40 AM

బీసీలు ఏకతాటిపై నిలబడి అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుదామని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, బీసీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర పార్టీశ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు.

బీసీల సత్తా చాటుదాం.. పెత్తందారి జగన్‌ను తరిమికొడదాం
సంఘీభావం తెలుపుతున్న టీడీపీ, జనసేన నాయకులు

మచిలీపట్నం టౌన్‌, ఫిబ్రవరి 7 : బీసీలు ఏకతాటిపై నిలబడి అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుదామని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, బీసీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర పార్టీశ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మచిలీపట్నం బైపాస్‌ రోడ్డులో బుధవారం రాత్రి జయహో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ, బీసీలు గళం ఎత్తితే తాడేపల్లి ప్యాలె్‌సలో జగన్‌కు దడపుడుతోందన్నారు. దీంతో బీసీ నాయకులను అరెస్టులు చేస్తున్నారన్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు. రాష్ట్రంలో 962 జయహో బీసీ సదస్సులు నిర్వహిద్దామనుకున్నామని, ఇప్పటికి 800 పూర్తయ్యాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చిన తరువాతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అండగా ఉంటారన్నారు. చంద్రబాబును ఏ జైలులో పెట్టించారో అదే జైలులోని బ్లాకులో జగన్‌రెడ్డికి చిప్పకూడు తినే యోగం పడుతుందన్నారు. మాజీ ఎంపీ, టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కొనకళ నారాయణ మాట్లాడుతూ, బీసీల కోసం ప్రత్యేక చట్టాన్ని చంద్రబాబు తీసుకువస్తారన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబును ఇష్టారాజ్యంగా విమర్శిస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో బీసీలు వేధింపులకు గురయ్యారన్నారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ, బీసీ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి, నియోజకవర్గ బీసీ అధ్యక్షుడు గోకుల శివ, బీసీ సూర్యబలిజ రాష్ట్ర కన్వీనర్‌ చిత్తజల్లు నాగరాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2024 | 12:40 AM