Share News

మెడికల్‌ కోడింగ్‌, విదేశీ విద్యపై సెమినార్‌

ABN , Publish Date - Nov 15 , 2024 | 12:31 AM

స్థానిక కేవీఎస్‌ఆర్‌ సిద్ధార్థ ఫార్మశీ కళాశాలలో గురువారం మెడికల్‌ కోడింగ్‌, విదేశీ విద్య విశిష్టతపై అంతర్జాతీయ స్థాయిలో సెమినార్‌ జరిగింది.

మెడికల్‌ కోడింగ్‌,   విదేశీ విద్యపై సెమినార్‌

మెడికల్‌ కోడింగ్‌,

విదేశీ విద్యపై సెమినార్‌

మొగల్రాజపురం, నవంబరు 14

( ఆంధ్రజ్యోతి): స్థానిక కేవీఎస్‌ఆర్‌ సిద్ధార్థ ఫార్మశీ కళాశాలలో గురువారం మెడికల్‌ కోడింగ్‌, విదేశీ విద్య విశిష్టతపై అంతర్జాతీయ స్థాయిలో సెమినార్‌ జరిగింది. ఈ సెమినార్‌లో ముఖ్య అతిథులుగా దుబాయ్‌కు చెందిన ప్రీ అప్రూవల్‌ అధికారి, ఆడిటర్‌ మెహరున్నీసా, ఆతిథ్య వక్తగా బిజినెస్‌ ఎనలిస్ట్‌ అహ్మద్‌ షేక్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హేల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికెట్‌ కోర్సులు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, కోడింగ్‌ నేర్చుకునే పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఏ. సునీత, కళాశాల ఫార్మాకాలేజీ విభాగాధిపతి డాక్టర్‌ సుప్రియ, అల్యుమినీ కార్యదర్శి డాక్టర్‌ బి. అనుపమ పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2024 | 12:31 AM