Kollu Ravindra: నూతన మద్యం పాలసీపై సభలో మంత్రి కొల్లు రవీంద్ర స్టేట్‌మెంట్
ABN , Publish Date - Nov 20 , 2024 | 04:32 PM
Andhrapradesh: మద్యం పాలసీపై మంత్రి కొల్లు రవీంద్ర స్టేట్‌మెంట్ ఇచ్చారు. మద్యం రేట్లు 70 శాతం పెంచేయడంతో చివరకు పేదలు జేబులకు చిల్లులు పడ్డాయని తెలిపారు. ఎక్సైజ్ డిపార్టమెంట్‌లోని ఉద్యోగులను వేరు చేసి సెబ్‌ను ఏర్పాటు చేశారన్నారు. లిక్కర్ ధరలు పెరగడంతో వినియోగదారులు ఇలిసిట్ లిక్కర్ వైపు మళ్ళారని కొల్లు రవీంద్ర తెలిపారు.
అమరావతి, నవంబర్ 20: నూతన మద్యం పాలసీపై ఏపీ అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) స్టేట్‌మెంట్ ఇచ్చారు. మద్యం విషయంలో గత ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వ్యవస్థను దెబ్బ తీసిందని విమర్శించారు. అప్పటి సీఎం ప్రచార సభల్లో మద్య నిషేదం అని చెప్పి మద్యనిషేధం దశలవారీ అని తరువాత అన్నారని తెలిపారు.
కవరింగ్ కోసం జగన్ వేషాలు చూశారా..!
ముందుగా కొన్ని దుకాణాలను తగ్గిస్తున్నట్టు తగ్గించి ఏపీటీడీసీ పేరుతో, బార్‌ల పేరుతో దుకాణాలు ఇచ్చారన్నారు. మద్యం రేట్లు 70 శాతం పెంచేయడంతో చివరకు పేదలు జేబులకు చిల్లులు పడ్డాయని తెలిపారు. ఎక్సైజ్ డిపార్టమెంట్‌లోని ఉద్యోగులను వేరు చేసి సెబ్‌ను ఏర్పాటు చేశారన్నారు. లిక్కర్ ధరలు పెరగడంతో వినియోగదారులు ఇలిసిట్ లిక్కర్ వైపు మళ్ళారన్నారు. ఎమ్మార్పీ రేటు పెరగడంతో చాలా మంది గంజాయి, నాటుసారా వైపు వెళ్ళారన్నారు.
రెజ్లర్‌కు రింగులోనే గుండుగీకిన ట్రంప్..
బ్రాండ్ విలువ చెప్పకుండా అమ్మకాలు చేపట్టారని మండిపడ్డారు. గత అయిదేళ్లలో అసమర్థ విధానాల వల్ల గణనీయమైన రాబడి రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందని చెప్పారు. ఐదేళ్లలో 18వేల 68 కోట్ల రూపాయల రాబడిని కోల్పోయామని వెల్లడించారు. ఏపీ నుంచి ఎంఎన్‌సీలను తరిమేశారన్నారు. మార్కెట్‌లో ఊరు పేరు లేని 26 కొత్త కంపెనీలను తీసుకువచ్చారని.. వీటిని ప్రవేశపెట్టడం ద్వారా పేదల ఆరోగ్యాలను దెబ్బతీశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
రెహ్మాన్ డైవర్స్.. అమీన్ ఎమోషనల్
Read Latest AP News And Telugu News