Share News

Lokesh: చిన్నాన్న ఇక చిరకాల జ్ఞాపకం

ABN , Publish Date - Nov 16 , 2024 | 04:45 PM

Andhrapradesh: నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. ‘‘మౌన‌మునిలా మారిన చిన్నాన్న ఇన్నాళ్లూ మాకు కంటికి క‌నిపించే ధైర్యం. నేటి నుంచి చిర‌కాల జ్ఞాప‌కం. చిన్నాన్న ఆత్మకు శాంతి క‌ల‌గాల‌ని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. అంతులేని దుఃఖంలో ఉన్న త‌మ్ముళ్లు, పిన్ని దైర్యంగా ఉండాల‌ని కోరుతున్నాను’’ అని లోకేష్ అన్నారు.

Lokesh: చిన్నాన్న ఇక చిరకాల జ్ఞాపకం
Minister Nara lokesh

అమరావతి, నవంబర్ 16: నారా రామ్మూర్తి నాయుడు (Nara Rammurthy Naidu) మృతిపట్ల మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడు మృతి తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. ‘‘చిన్నాన్నతో చిన్ననాటి నా అనుబంధం క‌ళ్ల ముందు క‌దిలి వ‌చ్చిన క‌న్నీటితో నివాళులు అర్పిస్తున్నాను. మౌన‌మునిలా మారిన చిన్నాన్న ఇన్నాళ్లూ మాకు కంటికి క‌నిపించే ధైర్యం. నేటి నుంచి చిర‌కాల జ్ఞాప‌కం. చిన్నాన్న ఆత్మకు శాంతి క‌ల‌గాల‌ని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. అంతులేని దుఃఖంలో ఉన్న త‌మ్ముళ్లు, పిన్ని దైర్యంగా ఉండాల‌ని కోరుతున్నాను’’ అని మంత్రి లోకేష్ అన్నారు.

Phone Tapping: పోలీసుల విచారణకు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే



మరోవైపు హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కాసేపటి క్రితమే ఢిల్లీ నుంచి బేగంపేట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఏఐజీ ఆస్పత్రికి చంద్రబాబు రానున్నారు. ఏఐజీ ఆస్పత్రిలో ఉన్న నారా రామ్మూర్తి నాయుడు భౌతికకాయానికి మాజీమంత్రి మోత్కుపల్లి, తీగల‌ కృష్ణారెడ్డి, సినీ‌ నటుడు సుమన్, జీవిత నివాళులర్పించారు. అలాగే రామ్మూర్తి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.


ఆయన కృషి ఎప్పటికీ చిరస్మరణీయం: కేశినేని చిన్ని

kesineni-chinni-tdp.jpg

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మృతి ప‌ట్ల ఎంపీ కేశినేని శివనాథ్ సంతాపం తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతి క‌లిగించిందన్నారు. ఎమ్మెల్యేగా చంద్రగిరి నియోజకవర్గానికి ఆయన చేసిన‌ సేవలు ఎనలేనివని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం రామ్మూర్తి అందించిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయమన్నారు. రామ్మూర్తి నాయుడు కుటుంబ స‌భ్యుల‌కు ఎంపీ శివనాథ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకున్నాను అని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు.


రామ్మూర్తి మృతి బాధాకరం: మంత్రి సవిత

savitha.jpg

సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతిపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మృతి బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కోరుతున్నామన్నారు. రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులకు మంత్రి సవిత తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే రామ్మూర్తి నాయుడు మరణంపై మంత్రి నిమ్మల రామానాయుడు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామ్మూర్తి నాయుడు కుటుంబసభ్యులకు మంత్రి నిమ్మల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


ఇవి కూడా చదవండి...

Adireddy Srinivas:ఆదిరెడ్డి భవానిపై ట్రోల్స్..ఆదిరెడ్డి వాసు వార్నింగ్

AP: ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి సర్చ్ వారెంట్.. ఏ క్షణంలోనైనా..

Read Latest AP News ANd Telugu News

Updated Date - Nov 16 , 2024 | 05:43 PM