AP Assembly: మంత్రులే ఇలా చేస్తే ఎలా..
ABN , Publish Date - Nov 15 , 2024 | 10:32 AM
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తాలు కొనసాగుతున్నాయి. పలు అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. అయితే ఈరోజు సభలో ఓ మంత్రి క్షమాపణలు చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం.
అమరావతి, నవంబర్ 15: నాలుగవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అయితే ఓ మంత్రి సభలో క్షమాపణలు చెప్పారు. మళ్లీ ఇంకోసారి ఇలా జరుగదు అని అన్నారు. ఇంతకీ సభలో ఏం జరిగింది.. క్షమాపణలు చెప్పిన మంత్రి ఎవరు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎందుకు క్లాస్ తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం.
AP News: ఈ గ్రామస్తులకు సలామ్ కొట్టాల్సిందే.. చేసిన పని అలాంటిది మరి..
మంత్రి క్షమాపణలు
కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ క్షమాపణలు చెప్పారు. ఈరోజు మంత్రి సభకు ఆలస్యంగా వచ్చారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన సమయంలో ముందుగా మంత్రి వాసంశెట్టి ఓ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రశ్నోత్తరాల సమయానికి మంత్రి లేకపోవడంతో ప్రశ్న ముందుగా వాయిదా పడింది. ఆ తరువాత మంత్రి ఆలస్యంగా సభకు రావడంతో తిరిగి సభ్యులు ప్రశ్న వేశారు. అయితే ఈ విషయంపై మంత్రికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు పలు సూచలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని మంత్రిని కోరారు. మంత్రులే లేట్‌గా వస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. సకాలంలో వచ్చేందుకు మంత్రులు ప్రయత్నించాలని స్పీకర్ కోరారు. అయితే సభకు ఆలస్యంగా వచ్చినందుకు మంత్రి వాసంశెట్టి సుభాష్ క్షమాపణలు కోరారు. తిరిగి ప్రశ్నోత్తరాలు కొనసాగాయి.
కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
మరోవైపు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో కరువు నివారించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజక్టు వ్యయం 17వేల 50 కోట్లు అని.. ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి వరద నీరు 63.20 టీఎంసీ లు సరఫరా చేయాలని ప్రతిపాదించామన్నారు. 2019-24 వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌కు రెండు దశల్లో రూ.17050 కోట్లకు పాలనా అనుమతులు ఇచ్చి 5 రూపాయల పని కూడా చేయలేదని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులున్నా రూ.1600 కోట్లతో ఇప్పటికే టెండర్లు పూర్తిచేసి టైం షెడ్యూల్ కూడా ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి ప్రాధాన్యత పోలవరం అయితే రెండో ప్రాధాన్యత ఉత్తారాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు. వచ్చేనెలలో పనులు ప్రారంభించి 2025 జులై నాటికి గోదావరి వరద జలాలను ఉత్తరాంధ్రకు అందిస్తామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
Viral News: 2050కి కోటి రూపాయల విలువ ఎంత.. ఏఐ సమాధానం తెలిస్తే షాక్..
మంత్రి సమాధానంపై ఎమ్మెల్యే నిరాశ
అయితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి ఇచ్చిన సమాధానం చాలా నిరాశకలిగిందని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతాలు అని తెలిపారు. దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా వచ్చినందుకు ఆయనకు శుభాకాంక్షులు తెలిపారు. ఎన్టీపీసి, జెన్ కో జాయింట్ ప్రాజెక్టుకు ప్రధాని వస్తున్నారని.. పోలవరం లెఫ్ట్ కెనాల్ సీఎం చూశారని.. ఒకటిన్నర సంవత్సరాల్లో పూర్తిచేస్తామన్నారని.. పోలవరం వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి పడే పరిస్ధితి లేదన్నారు. ఉత్తరాంధ్ర నుండే వలసలు ఎక్కువయ్యాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల కంటే తక్కవ ఆధాయం ఉన్నది ఉత్తరాంధ్ర అని తెలిపారు. ఉభయ రాష్ట్రాల్లో అత్యంత తక్కవ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం విజయనగరం అని.. ఈ పరిస్థితి మారాలంటే గోదావరి జలాలు ఉపయోగించుకోవాలన్నారు. పోలవరం వరకూ ఇచ్చాపురం వరకూ నీరు వెళ్లే పరిస్థితి ఉన్నా అప్పట్లో సాధ్యం కాలేదన్నారు. 2009లో ప్రారంభించినా తరువాత ఆగిపోయిందని తెలిపారు. రూ.2000 కోట్లు కేటాయించి ఈ పనులు ముందుకు తీసుకువెళ్ళారన్నారు. విజయనగరంలో 3 లక్షల 60వేలు, విశాఖకు 3 లక్షలు వస్తుందని.. ఉత్తరాంధ్ర పదహారు నదులు కలిపే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ వెల్లడించారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు గోదావరి వరద నీరు 63 టీఎంసీలు తరలించాలని అన్నారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, శ్రీకాకుళంకు ఈ ప్రాజక్టు లైఫ్ లైన్ అని మంత్రి పేర్కొన్నారు.
మరోవైపు నాలుగవ రోజు ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రం నిత్యవసర ధరల పెరుగుదలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అలాగే అంబేద్కర్ యూనివర్శిటీ విద్యార్థుల సమస్యలపై పీడీఎఫ్ వాయిదా తీర్మానం ఇవ్వగా.. మండలి చైర్మన్ వాయిదా తీర్మానాలను తిరస్కరించారు.
ఇవి కూడా చదవండి...
Hyderabad: సైబర్ నేరగాళ్లు కాజేసిన డబ్బు రికవరీ
Kartik Purnima 2024: కార్తీక పౌర్ణమికి ఈ వస్తువులు దానం చేయండి.. లక్ష్మీ దేవి తప్పకుండా..
Read Latest AP News And Telugu News