Kotamreddy: డీజీపీకి పీవీ రమేష్ రాసిన లేఖపై స్పందించండి.. హోంమంత్రికి కోటంరెడ్డి లేఖ
ABN , Publish Date - Nov 20 , 2024 | 02:57 PM
Andhrapradesh: స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చెప్పిన అంశాలపై వెంటనే దర్యాప్తు చేయాలంటూ హోంమంత్రి అనితకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖతో పాటు ఏబీఎన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ , పీవీ రమేష్‌తో చేసిన ఇంటర్వ్యూ క్లిప్పింగ్, ఆంధ్రజ్యోతి వార్తా కథనాన్ని శ్రీధర్ రెడ్డి జత చేశారు. స్కిల్ డెవలప్మెంట్‌కు సంబధించిన ఫైళ్లు సీఎంవో, సీఐడీ, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలో ఫైళ్లు ఒకేసారి గల్లంతు అయ్యాయని పేర్కొన్నారు.
అమరావతి, నవంబర్ 20: హోంమంత్రి వంగలపూడి అనితకు (Home Minister Vangalapudi Anitha) నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridharreddy) లేఖ రాశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చెప్పిన అంశాలపై వెంటనే దర్యాప్తు చేయాలని కోరారు. చంద్రబాబుపై గత ప్రభుత్వంలో కుట్రలు చేశారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్.. డీజీపీకి రాసిన లేఖపై హోంమంత్రి స్పందించాలని కోరారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరుతున్నట్లు తెలిపారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైలులో పెట్టారని గుర్తుచేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ వాంగ్మూలాన్ని ఫాబ్రికేట్ చేశారని ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి డిపేట్‌లో రమేష్ చెప్పారని లేఖలో పేర్కొన్నారు.
కవరింగ్ కోసం జగన్ వేషాలు చూశారా..!
ఇది వ్యక్తిపై జరిగిన దాడి కాదని.. వ్యవస్థలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. గత ప్రభుత్వంలోని పెద్దల ప్రమేయం లేకుండా ఫైళ్లు మాయం కావని పీవీ రమేష్ డిబేట్‌లో చెప్పారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ లేఖతో పాటు ఏబీఎన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ , పీవీ రమేష్‌తో చేసిన ఇంటర్వ్యూ క్లిప్పింగ్, ఆంధ్రజ్యోతి వార్తా కథనాన్ని శ్రీధర్ రెడ్డి జత చేశారు. స్కిల్ డెవలప్మెంట్‌కు సంబధించిన ఫైళ్లు సీఎంవో, సీఐడీ, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలో ఫైళ్లు ఒకేసారి గల్లంతు అయ్యాయని పేర్కొన్నారు. ఫైళ్లు మాయం వెనుక అప్పటి సీఎంవోలోని పెద్దల ప్రమేయం ఉందని లేఖలో తెలిపారు. అందువలన దీనిపై వెంటనే విచారణ జరపాలని హోం మంత్రి అనితను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు.
కాగా.. గత ప్రభుత్వంలో చంద్రబాబుపై స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి అక్రమ కేసు బనాయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో దాదాపు 53 రోజుల పాటు చంద్రబాబు జైలులోనే ఉన్నారు. ఇదంతా కూడా కేవలం కక్ష పూరితంగానే జరిగిందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. నిన్న(మంగళవారం) అసెంబ్లీలో ఇదే అంశంపై పెద్ద ఎత్తున గళమెత్తారు. అలాగే ఈరోజు దీనిపై హోంమంత్రి వంగలపూడి అనితకు లేఖ రాశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్.. డీజీపీకి రాసిన లేఖపై వెంటనే స్పందించాలని లేఖలో హోంమంత్రిని కోరారు. అక్రమ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరిపితే పెద్దల ప్రమేయం కూడా బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు.
కోహ్లీ పోస్టు.. ఫ్యాన్స్ గుండెలు గుబేల్..
ఫైళ్లు ఏవిధంగా మాయం అవుతాయని.. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వాంగ్మూలాన్ని ఎలా ఫాబ్రికేట్ చేస్తారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. సీనియర్ అధికారి ముందుకు వచ్చి జరిగిన విషయాన్ని బహిరంగంగా చెబుతున్నారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అవినీతి లేకపోయినప్పటికీ.. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కేసులు పెట్టడం, ఆ కేసులో విశాంత్రి ఐఏఎస్ అధికారి ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా ఫాబ్రికేట్ చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం నిప్పులాంటిదని.. బయటపడక తప్పదని టీడీపీ శ్రేణులు కూడా చెబుతున్నారు. ఈ అంశంపై వెంటనే విచారణ జరగాలని టీడీపీ శ్రేణులు, కూటమి నేతలు, ప్రజలు కోరుతున్న పరిస్థితి. సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్.. తన వాంగ్మూలాన్ని ఫాబ్రికేట్ చేశారని ఏబీఎన్ డిబేట్‌లో పాల్గొని చెప్పడం, ఆంధ్రజ్యోతి పత్రిక ఇంటర్వ్యూ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి...
రెహ్మాన్ డైవర్స్.. అమీన్ ఎమోషనల్
Read Latest AP News And Telugu News