Share News

హిందీ భాషపై పట్టు సాధించాలి

ABN , Publish Date - Nov 15 , 2024 | 12:29 AM

జాతీయ భాష హిందీపై ప్రతి విద్యార్థి పట్టు సాధించాలని, దేశంలో ఎక్కడికి వెళ్లినా ఉపాధి ఉద్యోగావకాశాలు ఉంటాయని పీబీ సిద్ధార్థ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌ చెప్పారు.

 హిందీ భాషపై పట్టు సాధించాలి

హిందీ భాషపై పట్టు సాధించాలి

పీబీ సిద్ధార్థ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌

మొగల్రాజపురం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జాతీయ భాష హిందీపై ప్రతి విద్యార్థి పట్టు సాధించాలని, దేశంలో ఎక్కడికి వెళ్లినా ఉపాధి ఉద్యోగావకాశాలు ఉంటాయని పీబీ సిద్ధార్థ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌ చెప్పారు. గురువారం కళాశాల హిందీ విభాగం ఆధ్వర్యంలో జాతీయ అక్షరాస్యతా దినోత్సవం నిర్వహించారు. కళాశాల డైరెక్టర్‌ వేమూరి బాబురావు, డీన్‌ రాజేష్‌ జంపాల మాట్లాడుతూ జాతీయభాష హిందీ నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కేఆర్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అద్దంకి) ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి. మోహన్‌రావు చదువు గొప్పతనాన్ని, గురువుల గొప్పతనాన్ని వివరించారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం చేశారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ దాస్‌, హిందీ విభాగ అధ్యక్షురాలు డాక్టర్‌ ఎం. జయలక్ష్మి, లెక్చరర్‌ భవ్య, తెలుగు విభాగం డాక్టర్‌ సత్యశ్రీ, డాక్టర్‌ నీరజ, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2024 | 12:30 AM