Share News

సబ్సిడీపై నేపియర్‌ గడ్డి విత్తనాలు

ABN , Publish Date - Jun 29 , 2024 | 02:03 AM

కృష్ణామిల్క్‌ యూని యన్‌ ద్వారా సూపర్‌ నేపియర్‌ పచ్చగడ్డి విత్తనాలను సబ్సిడీపై పాడిరైతులకు అందజేస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆం జనేయులు పేర్కొన్నారు.

సబ్సిడీపై నేపియర్‌ గడ్డి విత్తనాలు

పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి: కృష్ణా మిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, జూన్‌ 28: కృష్ణామిల్క్‌ యూని యన్‌ ద్వారా సూపర్‌ నేపియర్‌ పచ్చగడ్డి విత్తనాలను సబ్సిడీపై పాడిరైతులకు అందజేస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆం జనేయులు పేర్కొన్నారు. కాకుల పాడు పాలసొసైటీ ఆవరణలో శుక్రవారం పాడిరైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. సబ్సిడీపై పచ్చగడ్డి విత్తనాలు, దాణా అందించడంతో పాటు మేలు జాతి పశు వుల కొనుగోలుకు యూనియన్‌ సహకారం అందిస్తోందనన్నారు. ప్రస్తుతం పచ్చగడ్డి దొరకడం లేదని రైతులు చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలోని కొన్ని పొలాలు, మాన్యం లీజుకు తీసుకుని, పశుగ్రాసాన్ని పెంచుకోవాలని రైతులకు చలసాని సూచించారు.

Updated Date - Jun 29 , 2024 | 02:03 AM