Share News

10న సీపీఎస్‌ ఉద్యోగుల చలో విజయవాడ

ABN , Publish Date - Dec 06 , 2024 | 12:59 AM

కంట్రిబ్యూషన్‌ పెన్షన్‌ స్కీమ్‌ రద్దుచేసి పాతపెన్షన్‌ విధానం అమలు చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఏపీ సీపీఎ్‌సఈఏ ఆధ్వర్యంలో ఈనెల 10న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఉద్యోగులు, పెన్షనర్లు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ నాంచారయ్య పిలుపునిచ్చారు.

10న సీపీఎస్‌ ఉద్యోగుల చలో విజయవాడ

జయప్రదం చేయాలని ఏపీ సీపీఎ్‌సఈఏ పిలుపు

ఉయ్యూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కంట్రిబ్యూషన్‌ పెన్షన్‌ స్కీమ్‌ రద్దుచేసి పాతపెన్షన్‌ విధానం అమలు చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఏపీ సీపీఎ్‌సఈఏ ఆధ్వర్యంలో ఈనెల 10న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఉద్యోగులు, పెన్షనర్లు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ నాంచారయ్య పిలుపునిచ్చారు. నాగళ్ల రాజేశ్వరమ్మ, జానకిరామయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం సీపీఎ్‌సఈఏ జిల్లా కమిటీ, పెన్షనర్స్‌ అసోసియేషన్‌తో కలసి చలో విజయవాడ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. సీపీఎస్‌ ఉద్యోగులతో పాటు పెన్షనర్లు చలో విజయవాడ కార్యక్రమంలో పాలొని ఓపీఎస్‌ సాఽధించాలన్నారు. సీపీఎస్‌ ఉద్యోగులకు అసోసియేషన్‌ ఆర్థిక కార్యదర్శి వీరయ్యనాయక్‌, జిల్లా పెన్షనర్స్‌ అసోసియేషన్‌ కె.సాంబిరెడ్డి, జనరల్‌ సెక్రటరీ హాసన్‌ అహ్మద్‌, కేఏ విశ్వమోహన్‌, పరాత్పరి మద్దతు పలికారు.

Updated Date - Dec 06 , 2024 | 12:59 AM